Friday, October 18, 2024

AP – ఏనుగుల గుంపు విధ్వంసం – రైతు దుర్మరణం

మామిడితోట యాజ‌మాని దుర్మ‌ర‌ణం
భ‌యాందోళ‌న‌తో రైతులు, ప్ర‌జ‌లే ప‌రుగులు
ఏనుగుల నుంచి కాపాడ‌మంటూ ఆర్త‌నాధాలు

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేసింది.. అటవీప్రాంతం నుంచి పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఏనుగులు గుంపు విధ్వంసం సృష్టించాయి.. దేవళంపేట, అయ్యావాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డి పల్లెలో ఏనుగుల గుంపు పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి.. వరి పంటను తొక్కి నాశనం చేశాయి ఏనుగులు.. ఇక, ఏనుగుల దాడిలో ఓ రైతు మృతి చెందాడు.. పుంగనూరు నుండి పీలేరు వైపునకు వెళ్తున్న ఏనుగుల గుంపు.. పీలేరు సమీపంలో ఇందిరమ్మ కాలనీ వద్ద మామిడి తోటలోకి చొరబడ్డాయి.. ఏకంగా 15 ఏనుగులు గుంపు మామితోటలను ధ్వంసం చేసింది..

ఈ క్ర‌మంలోనే మామిడి తోపు యజమాని రాజారెడ్డిని తొక్కి చంపేశాయి ఏనుగులు గుంపు. దీంతో, ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. మరోవైపు ఏనుగుల గుంపు సృష్టించిన విధ్వంసంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు రైతులు.. ఇక, ఆ ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించారు ఫారెస్ట్‌ అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement