Friday, January 31, 2025

AP – నేటి నుంచి వాట్సప్ గవర్నెన్స్ సేవలు … లాంచ‌నంగా ప్రారంభించిన నారా లోకేష్

లాంచ‌నంగా ప్రారంభించిన నారా లోకేష్
వాట్స‌ప్ ద్వారా ఇంటి నుంచే 161 సేవ‌లు
వాట్సప్ గవర్నెన్స్ కోసం నెంబర్ 9552300009 కేటాయింపు
దేశంలో తొలిసారిగా ఎపిలోనే ఈ సేవ‌లు అందుబాటు
కార్యాల‌యాలు చుట్టు తిరిగే అవ‌స్థ‌ల‌కు ఇక బై బై
మ‌న మిత్ర పేరుతో ఇక వాట్సప్ సేవ‌లు

వెల‌గ‌పూడి – ఆంధ్ర‌ప్ర‌భ – ఆంధ్రప్రదేశ్‌‌లో మ‌న మిత్ర పేరుతో వాట్సప్ గవర్నెన్స్ సేవలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి.. ఈ సేవ‌ల‌ను నేడు ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఇక నుంచి ప్రభుత్వ ధృవపత్రాలన్నీ వాట్సప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా వాట్సప్ సేవల కోసం నెంబర్‌ను విడుదల చేశారు మంత్రి లోకేష్. వాట్సప్ గవర్నెన్స్ కోసం నెంబర్ 9552300009ను అనౌన్స్ చేశారాయన.

- Advertisement -

ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు, వినతులు స్వీకరించేం దుకు, అవసరమైన సమాచారం చేరవేసే ఉద్దేశ్యంతో దీన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్ల‌డించారు. తొలి దశలో 161 రకాల సేవలు, రెండో దశలు 300 రకాల సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. దీని కోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 95523 00009 నెంబర్ ను ప్రభుత్వం కేటాయించింది. తొలి దశలో దేవాదాయ, ఇంధన, ఆర్టీసీ, రెవిన్యూ, మున్సిపల్ శాఖల్లో వాట్సాప్ సేవలు మొదలయ్యాయి.

విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నుల వంటివి వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు. అలాగే ట్రేడ్ లైసెన్సులు, రెవిన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డులు, సర్టిఫికెట్లు, ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యానిల్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్ సర్వీసు, రిఫండ్, ఫీడ్ బ్యాక్ వంటి సేవలు పొందవచ్చు. ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య ఇదొక ఫ్లాట్ ఫామ్‌గా వర్ణించారు మంత్రి లోకేష్.

ఫిర్యాదుల విషయంలో అయితే ఈ వాట్సాప్ నెంబర్‌కు మెసేజ్ చేస్తే వెంటనే ఓ లింక్ వస్తుంది. అందులో పేరు, ఫోన్ నెంబర్, చిరునామా, వినతులను పొందుపరచాలి. వెంటనే వారికి రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. వాటి ఆధారంగా తమ సమస్య ఎంతవరకు పరిష్కారం అయ్యిందో తెలుసుకోవచ్చు.

ఇదేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అర్హతలు గురించి వివరాలు తెలుసుకునే వీలుంది. ఇక పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సాప్‌లో పంపిస్తారు. కావాల్సిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని టికెట్లు, వసతి సహా అన్నీ బుక్ చేసుకోవచ్చు.
ఇవేకాకుండా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయం, నో ఎర్నింగ్ ఇలా అనేక రకరకాలకు సంబంధించి వాట్సాప్ ద్వారా సేవలను పొందవచ్చు. సీఎం సహాయనిధికి చేసిన దరఖాస్తు స్టేటస్ సైతం తెలుసుకునే వీలుంది.

ఆ సమస్య ఉండొద్దనే..

సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వాట్సప్ ద్వారా పౌరసేవలు అందించేందుకు 2024 అక్టోబరు 22న మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు ఇప్పుడు వాట్సప్ గవర్నెన్స్ తీసుకువ‌చ్చింది రాష్ట్ర ప్రభుత్వం. వేగంగా పౌరసేవలు అందించటం, పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా వాట్సప్ గవర్నెన్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు. సమాచార గోప్యత, వేగంగా సేవలందించేందుకు జనరేటివ్ ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సప్ గవర్నెన్స్ పని చేస్తుంది. ఈ సేవ‌ల‌కు మ‌న మిత్ర అని నామ‌కార‌ణం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement