Friday, October 18, 2024

AP | పూర్ణాహుతితో ముగిసిన దసర ఉత్సవాలు.. దుర్గ‌మ్మ చెంత‌ పోటెత్తిన భ‌వానీలు

ఎన్టీఆర్ జిల్లా బ్యూరో (ఆంధ్ర‌ప్ర‌భ‌) : ఇంద్రకీలాద్రిపై దసర శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు ద‌ర్శ‌నమిచ్చారు. చివరి రోజు దసరా నాడు రాజరాజేశ్వరి దేవీగా అభ‌య‌మిచ్చారు.

ఉత్సవాల్లో చివరి రోజు యాగశాలలో చండీహోమం అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. కార్యక్రమంలో దుర్గగుడి ఈవో రామారావు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రికి భవానీ మాలధారులు పోటెత్తారు.

జలవిహారానికి ప‌ర్మిష‌న‌ల్ లేదు :

శ‌నివారం తెల్లవారుజాము 3 గంటల నుంచే రద్దీ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు కొండపైనుంచి ఉత్సవమూర్తులతో ఊరేగింపు నిర్వహించారు. గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామికి దుర్గా ఘాట్‌ వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

ఏటా కృష్ణానదిలో నిర్వహించే జలవిహారానికి ఈ ఏడాది అనుమతి నిరాకరించారు. నీటి ఉద్ధృతి కారణంగా దుర్గా ఘాట్‌ వద్దే ఉత్సవమూర్తులకు హంస వాహనంపై పూజలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -

భవానీల రాక‌తో..

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. విజయదశమి రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నవరాత్రుల్లో ఆఖరి రోజు కావడంతో సాధారణ భక్తులతో పాటు అధిక సంఖ్యలో భవాని మాల ధరించిన భక్తులు దర్శనార్థం వచ్చారు. ఏర్పాట్లపై అంద‌రూ సంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement