ఏపీలో రోజువారి కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 62,856 శాంపిల్స్ పరీక్షించగా.. 1,439 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 14 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. తాజా టెస్ట్‌లతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిశీలించిన శాంపిల్స్ సంఖ్య 2,71,61,870కి చేరుకోగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 20,26,042కు చేరింది. రికవరీ కేసులు 19,97,454కు పెరిగితే.. ఇప్పటి వరకు మృతిచెందిన కోవిడ్ బాధితుల సంఖ్య 13,964కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,624 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందినట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇక, గడిచిన 24 గంటల్లో 1,311 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
ఇది కూడా చదవండి: కాలిపై టాటూ..మియా ఖలీఫా సీరియస్