ఏపీ సీఎం జగన్ శనివారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతి భద్రతలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన న్యూఢిల్లీలో ఎల్లుండి సమావేశం జరగనుంది. ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌తో పాటు యూపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. మరోవైపు సీఎం జగన్ రెండు రోజుల పాటు ఢిల్లీలోనే పర్యటిస్తారు. తిరిగి ఎల్లుండి సాయంత్రం ఏపీకి తిరిగి రానున్నారు. అమిత్ షాతో విడిగానూ సమావేశం అయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ అమిత్‌షాతో అపాయింట్‌మెంట్ ఖరారైతే మాత్రం సీఎం జగన్ ఈ నెల 27న ఉదయం ఏపీకి వస్తారు. కాగా మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా చర్యలు యువకులను రిక్రూట్ చేసుకోవాలని మావోలు వ్యూహాలు రచించుకున్నారు. పలు రాష్ట్రాల్లో సమావేశాలు జరుపుతూ ఆదివాసీలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.