Tuesday, November 26, 2024

పండ్లు ఉన్న చెట్టుపైనే అందరూ రాళ్లు వేస్తారు: జగన్

ఉగాది పండుగను పురస్కరించుకుని వాలంటీర్లకు సత్కారం, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో సీఎం జగన్ సోమవారం నాడు ప్రారంభించారు. వాలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను సీఎం జగన్‌ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ, వార్డు వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. పరిపాలన అంతా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా జరుగుతోందని.. లంచం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్నారని ప్రశంసించారు. వాలంటీర్లు రూపాయి లంచం తీసుకోకుండా పని చేస్తున్నారని, ప్రతి కుటుంబం వాలంటీర్‌ను తమ ఇంట్లోని సభ్యుడిగా భావిస్తున్నారని జగన్ కితాబిచ్చారు. ఇలాంటి వ్యవస్థపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. వాలంటీర్లు క్రమశిక్షణతో ఉండి.. ఇలాంటి విమర్శలు పట్టించుకోవద్దని సూచించారు. పండ్లు ఉన్న చెట్టుపైనే రాళ్లు వేస్తారని.. మానవ సేవే మాధవ సేవ అని వాలంటీర్లు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇకపై ప్రతి ఏడాది వాలంటీర్లను సత్కరిస్తామని జగన్ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement