ఏపీలో డ్రగ్స్ సరఫరా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అసలు డ్రగ్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్ ఆనవాళ్లే ఉండకూడదన్నారు. ఆ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్ ఎవరు పంపిణీ చేస్తున్నారు? ఎక్కడ నుంచి వస్తున్నాయ్.. అనే విషయాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు జగన్. దీన్ని ఒక సవాల్‌గా తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అక్రమ మద్యం, ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై సీఎం జగన్ సమీక్షించారు. అలాగే.. దిశ యాప్ అమలు పై కూడా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి మహిళ సెల్ ఫోన్లలో.. దిశ యాప్ ఉండేలా సన్నాహాలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: ట్రాఫిక్ చలాన్ కట్టిన మంత్రి కేటీఆర్.. పోలీసులకు అభినందనలు