కరోనా వ్యాక్సిన్ ప్రక్రియపై బుధవారం సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలను ఓపెన్ చేయాలన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులతో పాటు పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికీ కరోనా టీకాలు వేయాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. గ్రామం యూనిట్‌గా వ్యాక్సిన్లు వేయాలని సూచించారు. ప్రాధాన్య క్రమంలో వ్యాక్సిన్లు వేయడానికి వీలవుతుందని చెప్పారు. 18–44 ఏళ్ల వారికి టీకాలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రజల దగ్గరకు వెళ్లే ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది అందరికీ టీకాలు వేయాలన్నారు. వ్యాక్సిన్లను ఎక్కువగా వేస్ట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కుటుంబ సభ్యుల వివరాలను ఆరోగ్యశ్రీ కార్డులో క్యూఆర్ కోడ్ రూపంలో నమోదు చేయాలన్నారు. ఆ కోడ్ ను స్కాన్ చేయగానే వారి వివరాలు వచ్చేలా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డును ఆధార్ తో అనుసంధానించాలని సూచించారు. గ్రామాల్లోని క్లినిక్ ల నుంచి బోధనాసుపత్రుల దాకా జిల్లాను యూనిట్ గా తీసుకుని నియామకాలను చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కోవిడ్ నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్ సన్నద్ధతపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు:
ఏపీలో యాక్టివ్ కేసులు సంఖ్య: 18,882
రికవరీ రేటు: 98.37 శాతం
పాజిటివిటీ రేటు: 2.29 శాతం
3 కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు: 10
3 నుంచి 5 శాతం పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు: 2
5 కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఒక్క జిల్లాలో నమోదు
నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్ 93.39 శాతం
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్ 73.08 శాతం
16 దఫాలుగా ఇంటింటికీ కోవిడ్ సర్వే పూర్తి
ఈ వార్త కూడా చదవండి: హాకీ ప్లేయర్ రజనీపై జగన్ సర్కార్ వరాల జల్లు