Friday, November 22, 2024

AP – అప‌చారం చేసి అబ‌ద్దాలు చెప్ప‌డం స్వామీ ద్రోహ‌మే – జ‌గ‌న్ కు ఘాటుగా బ‌దులిచ్చిన చంద్ర‌బాబు

తిరుల‌మ‌లో డిక్లెరేష‌న్ ఇవ్వాల్సిన బాధ్య‌త లేదా
అధికారం ఇచ్చింది సంప్ర‌దాయాల‌ను గౌర‌వించేందుకే
తిరుమ‌ల పోటు లో ప్ర‌మాదం జ‌రిగితే ఏముందిలే అంటారా
ఇప్ప‌టికైనా అంద‌రికి క్ష‌మాప‌ణ చెప్పండి జ‌గ‌న్

అమరావతి: గత ప్రభుత్వంలో దేవాలయాల్లో జరిగిన ఘటనల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వైసిపి అధ్యక్షుడు జగన్‌ దేవుడిని దర్శించుకోవచ్చని , కానీ ఆయనకు వేంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందా? లేదా? అనేది ముఖ్యమన్నారు. తిరుమలలో డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన బాధ్యత జగన్‌కు లేదా? అని నిలదీశారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో చంద్రబాబు పోస్ట్‌ చేశారు.

”నమ్మకం ఉంటే అన్యమతస్థులు సంప్రదాయం ప్రకారం తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలి. అలా డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్‌కు లేదా? సంప్రదాయాన్ని గౌరవించకపోతే తిరుమల ఎందుకు వెళ్లాలి? మీకు అధికారం ఇచ్చింది సంప్రదాయాలకు విరుద్ధంగా పని చేయడానికి కాదు. అది అడిగితే బూతులు తిట్టారు. వైసిపి హయాంలో జరిగిన ఘటనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

- Advertisement -

.. ఆంజనేయస్వామికి చెయ్యి నరికేస్తే ఏమైంది బొమ్మే కదా? అన్నారు. హనుమంతుడు బొమ్మా? వెంకటేశ్వరస్వామి బొమ్మా?… రాములవారి తల తీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా? అన్నారు. రథం కాలిపోతే.. ఏముందీ తేనెటీగలు వచ్చాయి అన్నారు. తిరుమల పోటులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమౌతుందని అడిగారు. ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. అందుకే బాధపడుతూ చెబుతున్నా. మనం అందరం ఉండి కూడా భగవంతుడికి ఇలా అపరాధం జరిగిందేది మన బాధ. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి.. ఇక భగవంతుడే చూసుకుంటాడు అని పేర్కొన్నారు.. ఏ మతమైనా సరే కానీ, వేరే వారిని చులకనగా చూడటం కరెక్ట్‌ కాదు. అపచారం చేసి ఆ అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం స్వామి ద్రోహం.. అంటూ ట్వీట్‌చేశారు ముఖ్యమంత్రి .

Advertisement

తాజా వార్తలు

Advertisement