Friday, December 20, 2024

AP – రైతు సేవా కేంద్రంలో చంద్ర‌బాబు – ధాన్యం అమ్మ‌కాల‌పై ఆరా

పెన‌మ‌లూరు – కృష్ణా జిల్లా గంగూరులో రైతు సేవాకేంద్రాన్ని సీఎం చంద్రబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా సేవ కేంద్రంలో ఓ రైతుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రైతు నుంచి ధాన్యం ఎలా సేకరిస్తారో సీఎంకు సేవాకేంద్రం సిబ్బంది చూపించారు. ధాన్యం తాను ఎలా అమ్ముతున్నది చంద్రబాబుకు రైతు ఆకునూరి సాంబశివరావు వివరించారు.

నిరుడు మీద ఈసారి పంట ఎక్కువ పండిందని రైతు వెల్లడించారు. మిషన్ కోత వల్ల రూ. 5, 6 వేలు ఎకరానికి ఈ ఏడాది కలిసి వచ్చింది అని రైతు వెల్లడించారు. దీనికి దిగుబడి పెరగడం కూడా కారణమని రైతు సాంబశివరావు తెలిపారు. గడ్డిని బయోఫ్యూయల్ ప్లాంట్ వాళ్లు తీసుకుంటే మరో రూ.5వేలు వరకూ వస్తుందని సీఎం చంద్రబాబుకు తెలిపారు. గతంలో మనుషులు కోస్తే ఎకరానికి రూ. 6వేలు కోతకు, మరో రూ. 6వేలు కుప్ప వేయడానికి అయ్యేదని తెలిపారు.
తొలకానికి మరో రూ. 3 వేలు ఖర్చు అయ్యేదన్నారు. ఈ లెక్కన అన్ని కలుపుకొని మనుషుల ద్వారా వ్యవసాయం చేస్తే రూ. 25వేలు దాకా ఖర్చు వచ్చేదన్నారు. ప్ర‌స్తుతం ధాన్యం డబ్బుల్లో కోత లేదు డబ్బులు కరెక్టుగానే వస్తున్నాయని చెప్పారు. ఇప్పడు ఉన్న వ్యవస్థ బాగానే పనిచేస్తోందన్నారు. కోత మిషన్ లు బయటనుంచి వస్తున్నాయని వివరించారు. ప్రోక్యూర్మెంట్‌కు షెడ్యూలింగ్ మొత్తం ఒకటిగా లేదా… వేర్వేరుగా పంట కోత కోస్తే పార్ట్ షెడ్యూలింగ్ ఇస్తామని సీఎం చంద్రబాబుకు సేవాకేంద్రం సిబ్బంది వివరించారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ, తేమశాతంలో సేవాకేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రావాలని.. కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుకు దిగుబడి ఎంత వస్తుందో కూడా నమోదు కావాలని అధికారులకు సూచించారు. ఎవరి దగ్గరైనా బాగా పంట పండితే సాగు పద్ధతులు ఏంటో తెలుసుకోవాలని అధికారుల‌ను కోరారు.. వరి పంట వేసే రకం తినగలిగేది అయి ఉండాలని సీఎం సూచించారు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ గ్రామంలో ఎంత ప్రోడెక్టవిటీ వచ్చింది చెప్పాలని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement