Saturday, January 4, 2025

AP బ‌న‌క‌చ‌ర్ల‌కు గోదావ‌రి జ‌లాలు … తెలుగుతల్లికి జలహారతిగా నామక‌ర‌ణం …చంద్రబాబు

వెల‌గ‌పూడి – గోదావ‌రి జ‌లాల‌ను రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించిన‌ట్ల‌యితే ఆ ప్రాంతం స‌స్య‌శ్యామలం కావ‌డమే కాకుండా , రాయ‌ల‌సీమ‌లో క‌ర‌వు మ‌టుమాయం అవుతుంద‌ని ఎపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు అన్నారు.. ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున తీసుకువస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఆ ప్రాజెక్టు పేరును ప్రకటించారు. ‘తెలుగుతల్లికి జలహారతి’ అని ప్రాజెక్టు పేరు వెల్లడించారు.

ప్రాజెక్టు గురించి చెబుతూ, రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే రతనాల సీమ అవుతుందని అన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తరచుగా కరవు బారినపడుతున్నాయని వివరించారు. పరీవాహక ప్రాంతాల్లోని రాష్ట్రాల నీటి వినియోగం కారణంగా… కృష్ణా నదిలో తగినంత నీటి లభ్యత ఉండడం లేదని వివరించారు. ఒక్క గోదావరి నదిలో మాత్రమే ఆశించిన మేర జలాలు అందుబాటులో ఉంటున్నాయని చంద్రబాబు తెలిపారు.

- Advertisement -

గోదావరి నీటిని మళ్లించలగితే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చని పేర్కొన్నారు. నదులు అనుసంధానం చేయగలిగితే రాష్ట్ర వ్యవసాయ రంగానికి నీటి కొరత అనే మాట వినిపించదని స్పష్టం చేశారు. గోదావరి నుంచి కనీసం 300 టీఎంసీల నీటిని కృష్ణా నదికి తీసుకురావడం… కృష్ణా పశ్చిమ, తూర్పు డెల్టాలకు నీళ్లు ఇచ్చిన తర్వాత ఇక్కడ్నించి బనకచర్లకు నీటిని తీసుకువెళ్లడం ఈ ప్రాజెక్టులో ప్రధానమైన అంశమ‌ని చంద్ర‌బాబు చెప్పారు.. ఇది మూడు దశల్లో ఉంటుంద‌ని, దీనిద్వారా వెలుగొండ ఆయకట్టు కూడా కవర్ అవుతుంద‌ని పేర్కొన్నారు.

తొలి ద‌శ‌లో నాగార్జునసాగర్ కుడి కాలువపై బొల్లాపల్లి ప్రాజెక్టు వస్తుందన్నారు… ఆ తర్వాత వెలుగొండ ప్రాజెక్టు… అక్కడ్నించి బనకచర్ల ప్రాజెక్టుకు నీళ్లు వెళతాయ‌ని చెప్పారు. నల్లమల అడవులను కొంతమేర నరికి టన్నెల్ ఏర్పాటు చేసిన బనకచర్లకు నీళ్లు తీసుకువెళతామ‌ని చెప్పారు. ఇదంతా జరిగితే నదుల అనుసంధానం పూర్తవుతుందని, ఈ నదుల అనుసంధానం ప్రక్రియలో ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయ‌న్నారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళ, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లా కొన్ని భాగాలు, నెల్లూరు, కడప, అనంతపురం… ఇలా రాష్ట్రమంతా అనుసంధానమై అదనపు ఆయకట్టు కూడా వస్తుంద‌న్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రాజెక్టు ఏపీకి ఒక గేమ్ చేంజర్ . అందుకే దీనిపేరు కూడా తెలుగుతల్లికి జలహారతి అని నామకరణం చేశామ‌న్నారు చంద్ర‌బాబు. అంటే మనం సమర్పించుకోవడమే, కన్నతల్లికి రుణం తీర్చుకోవడం అనే అర్థంలో ఈ పేరు పెట్టామ‌పి. . ప్రధాని మోదీకి ఈ ప్రాజెక్టు నివేదికను పంపిస్తున్నాం” అని చంద్రబాబు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement