Friday, November 22, 2024

AP – 20 కార్పొరేష‌న్ ల‌కు ఛైర్మ‌న్ ల నియామ‌కం

ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు నాయుడు
టిడిపికి 16, జ‌న‌సేన‌కు 3, బిజెపికి ఒక కార్పొరేష‌న్ కేటాయింపు
పార్టీ ని న‌మ్ముకున్న కార్య‌క‌ర్త‌ల‌కే పోస్టులు
త్యాగాలు చేసిన వారికి అవ‌కాశం

అమ‌రావ‌తి – ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేతలు చాలా మంది నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు.. అయితే, వారికి గుడ్‌న్యూస్‌ చెబుతూ వివిధ నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసింది చంద్రబాబు సర్కార్.. వివిధ కార్పొరేషన్లకు చైర్‌పర్సన్లను నియమించింది.. ఒకేసారి మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు భర్తీ చేసింది.. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి.. పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో ప్రధాన్యత కల్పించింది ప్రభుత్వం.. ఇక, నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు కూడా చోటు కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. కాగా 20 పోస్ట్ ల‌లో టీడీపీ – 16, జనసేన -3, బీజేపీ – 1 చొప్పున ఛైర్మ‌న్ ప‌ద‌వుల‌ను కేటాయించారు.

కార్పొరేషన్లు – ఛైర్మన్లు

వ‌క్ఫ్ బోర్డు – అబ్దుల్ అజీజ్
శాప్ – అనిమిని రవి నాయుడు
హౌసింగ్ బోర్డు – బత్తుల తాతయ్య బాబు
ట్రైకార్ – బురగం శ్రీనివాసులు
ఏపీ మారిటైం బోర్డు – దామచర్ల సత్య.
సీడ్ యాప్ – దీపక్ రెడ్డి
20 సూత్రాల అమలు – లంకా దినకర్ (బీజేపీ)
ఏపీ మార్క్ ఫెడ్ – కర్రోతు బంగార్రాజు
విత్తనాభివృద్ధి సంస్థ – మన్నె సుబ్బారెడ్డి
ఏపీఐఐసీ – మంతెన రామరాజు
పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ – నందం అబద్దయ్య
ఏపీ టీడీసీ – నూకసాని బాలాజీ
ఏపీఎస్సార్టీసీ ఛైర్మన్ – కొనకళ్ల నారాయణ
ఏపీఎస్సార్టీసీ వైస్ ఛైర్మన్ – పీఎస్ మునిరత్నం.
ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ – పీలా గోవింద్
లిడ్ క్యాప్ – పిల్లి మాణిక్యాల రావు.
ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ – పీతల సుజాత
ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పోరేషన్ – తమ్మిరెడ్డి శివ శంకర్ (జనసేన)
పౌరసరఫరాల కార్పోరేషన్ – తోట మెహర్ సీతారామ్ సుధీర్. (జనసేన)
ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్ – వజ్జా బాబురావు
ఏపీ టిడ్కో – వెనుములపాటి అజేయ్ కుమార్ (జనసేన)

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement