Saturday, November 30, 2024

AP – చంద్రబాబు పై కామెంట్స్ – దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

అమరావతి – వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బ్రహ్మణి వ్యక్తిత్వాన్ని కించపర్చేలా పోస్టులు పెట్టారని ఆయనపై టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement