Wednesday, October 23, 2024

AP – ఇక 17 మందితో ఆలయాల పాలకమండళ్లు …. చంద్రబాబు కేబినేట్ నిర్ణయం

సీఎం చంద్రబాబు సారథ్యంలో మంత్రిమండలి భేటీ
13 అంశాలపై చర్చించిన కేబినెట్​ బృందం
ఏడాదికి మూడు సిలిండర్లతో భారమే
అయిదేండ్లకు ప్రభుత్వంపై ₹13,423 కోట్ల అదనపు బారం
అయినా భరిస్తామన్న సీఎం చంద్రబాబు
శారద పీఠానికి భూముల కేటాయింపు రద్దు
రివర్స్ టెండరింగ్ ప్రివ్యూ కమిటీ రద్దు
17 మందితో ఆలయ పాలక మండళ్లు
సూపర్​ సిక్స్​ పథకాలు, ఇసుక విధానంపైనా మంత్రులతో సమీక్ష​

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి:
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జ‌రిగింది. మొత్తం 13 అంశాలపై ప్రధాన ఎజెండాగా కేబినెట్ భేటీలో చ‌ర్చించారు. దీపావళి కానుకగా దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వ‌డానికి మంత్రి మండ‌లి ఆమోదించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర ₹876. కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్​కు ₹25 సబ్సిడీ ఇస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రతి సిండర్​ ₹851గా ఉంది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో ప్రభుత్వంపై ₹2,684 కోట్ల అదనపు భారం పడనుంది. ఐదేళ్లకు కలిపి ₹13,423 కోట్ల అదనపు భారం అవుతుంది. దీని అమలుకు పూర్తి స్థాయిలో కేబినెట్‌లో ఏపీ మంత్రి మండలి ఓకే చేసింది.

- Advertisement -

శారదాపీఠం భూముల విషయంలో..

విశాఖలో శారద పీఠానికి గత ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేసే అంశంపై కేబినెట్‌లో చర్చించారు. ఈ భూముల కేటాయింపు రద్దుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో వందకోట్లు పైబడి జ్యూడిషియల్ రివ్యూ ప్రివ్యూ కమిటీ ఏర్పాటు చేసింది. తర్వాత రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. కూటమి ప్రభుత్వం ఈ అంశంపై సమీక్షించి జ్యూడీషియల్ ప్రీవ్యూ కమిటీని రద్దుకు అంగీకరించింది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందు ప్రతిపాదన వచ్చింది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించింది.

ఆలయ పాలకమండళ్లలో సభ్యుల పెంపు..

దేవాలయ పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించాలని, దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యులను నియమించటానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్‌లో ఉచిత ఇసుక పాలసీ అమలుపై చర్చ జరిగింది. గత కేబినెట్‌లో ఇసుక విషయంలో సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిస్థితిలో మార్పు రావాలని.. ఎక్కడ ఇసుక దొరకడం లేదు.. రేటు ఎక్కువ అనే మాట వినపడకూడదని ఆదేశాలు ఇచ్చారు. ఇసుక పాలసీ లక్ష్యం నెరవేరి తీరాలని గత కేబినెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా చెప్పారు. సూపర్ 6 పథకాలు అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు ఏ విధంగా లఅమలు అవుతున్నాయి. డ్రోన్ సమ్మిట్ అంశంతోపాటు పలు కీలకాంశాలపై కేబినెట్‌లో చర్చ జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement