Wednesday, November 13, 2024

AP – అంధ్రప్రదేశ్ బడ్జెట్ 24- 25 కేటాయింపులు ఇవే..

అభివృద్ధి, సంక్షేమం.. అందరికీ అన్నీ!

వార్షిక పద్దులో పేదలకు పెద్దపీట

శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావులమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర

తొలిసారి బడ్జెట్ సమర్పించిన మంత్రి కేశవ్

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్

- Advertisement -

ఇరిగేషన్, హెల్త్, విద్యకు అత్యంత ప్రాధాన్యం

రోడ్ల నిర్మాణానికి కీలక కేటాయింపులు

సంక్షేమానికి కూడా ఎక్కడా తగ్గలేవార్షిక బడ్జెట్ ₹2.94 లక్షల కోట్లు

ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్:అభివృద్ధి, సంక్షేమం రెండూ.. రెండు కళ్లు అనే నినాదంతో ఏపీలో కూటమి ప్రభుత్వం తన వార్షిక తొలిపద్దును అసెంబ్లీకి సమర్పించింది. ఎన్నికల్లో ఊరించిన సూపర్‌ సిక్స్‌ పథకాలకు కూటమి స‌ర్కారు తన తొలి బడ్జెట్టులో పెద్దపీట వేసింది. అభివృద్ధికి సముచిత స్థానం కల్పించింది. సోమవారం ఉదయం మంత్రి వర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. శాసనమండలిలో బడ్జెట్‌ను గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు.

ఈ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 22 వరకు కొన‌సాగ‌నున్నాయి. ప్రాధాన్యాంశాలివే..ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా ప‌య్యావుల కేశ‌వ్ తొలిసారి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. కాగా, వ్యవసాయం, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, రోడ్లనిర్మాణం సహా అభివృద్ధి కార్యక్రమాలకు బ‌డ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కడా తగ్గలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రెండు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్లుతో పద్దులు సరిపెట్టిన ప్రభుత్వం రెండు బడ్జెట్లకు కలిపి ₹2.39 లక్షల కోట్లకు ఆమోదం తీసుకుంది. 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ ₹2.94 లక్షల కోట్లతో పద్దును స్థిరీకరించారు. ఉదయం కేబినెట్‌ సమావేశంలో బడ్జెట్‌ ఆమోదం అనంతరం, ఇ- ఆఫీస్‌ ద్వారా గవర్నర్‌కు పంపించారు. గవర్నర్‌ అందుబాటులో లేకపోవడంతో ఆన్‌లైన్‌లో ఆమోదం తీసుకున్నారు. రెండు సార్లూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లే..

ఈ ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నాలుగు నెలలకు గాను ఓటాన్‌ అకౌంట్‌ను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరో నాలుగు నెలలకు గాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. సోమవారం అసెంబ్లీలో వచ్చే 4 నెలలకు పూర్తిస్థాయిలో 2024-25 ఏడాదికి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ నుంచి జులై వరకు మొదటి 4 నెలలకు రాష్ట్రంలో జీతాల చెల్లింపులు, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి ₹1,09,052.34 కోట్లకు ఆమోదం తీసుకున్నారు.

ఆర్థిక సంవత్సరం మొత్తానికి ₹2,86,389.27 కోట్లకు ప్రతిపాదించి 4 నెలల ఖర్చుకు ఆమోదం పొందారు. ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి..ఎన్నికలు జరిగి జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జులైలో పూర్తిస్థాయి బడ్జెట్‌ సమర్పించాల్సి ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులపై అవగాహన, పూర్తి సమాచారం కోసం వాయిదా వేయాల్సి వచ్చింది. మరో 4 నెలల కాలానికి తాత్కాలికంగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు గవర్నర్‌ ద్వారా ఆర్డినెన్సు జారీ చేయించారు.

ఆగస్టు నుంచి నవంబర్‌ వరకు ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులు ఇతర నిర్వహణ ఖర్చులకూ కలిపి ₹1,29,972.97 కోట్లకు అనుమతులు తీసుకున్నారు. ఇప్పటి వరకు 8 నెలల కాలానికి ₹2,39,025.31 కోట్లకు అనుమతి తీసుకున్నారు.

కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యం ఇచ్చింది.

రాష్ట్ర బడ్జెట్ స్వరూపం..₹ 2.94. లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్

వ్యవసాయ బడ్జెట్ ₹ 43,402.33 కోట్లు

రెవెన్యూ వ్యయం అంచనా : ₹2.34 లక్షల కోట్లు

మూలధన వ్యయం అంచనా : ₹ 32,712 కోట్లు

రెవెన్యూ లోటు : ₹34,743 కోట్లు

ద్రవ్యలోటు : ₹68,743 కోట్లు

జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా : 4.19 శాతం

జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా : 2.12 శాతం

పూర్తి కేటాయింపులివే..₹ 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్లో మానవ వనరులు : ₹ 16,705 కోట్లు

బీసీ సంక్షేమం : ₹39,007 కోట్లు

ఎస్సీ సంక్షేమం : ₹18,497 కోట్లు

ఎస్టీ సంక్షేమం : ₹7,557 కోట్లు

మైనార్టీ సంక్షేమం: ₹4,376 కోట్లు

మహిళ, శిశు సంక్షేమం : ₹ 4,285

కోట్లుమానవ వనరుల అభివృద్ధి : ₹ 1,215

కోట్లుపాఠశాల విద్య : ₹ 29,909 కోట్లు

ఉన్నత విద్య : ₹ 2,326 కోట్లు

ఆరోగ్య రంగం : ₹ 18,421కోట్లు

పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి : ₹ 16,739 కోట్లు

పట్టణాభివృద్ధి : ₹11,490 కోట్లు

గృహ నిర్మాణం : ₹ 4,012 కోట్లు

పరిశ్రమలు వాణిజ్యం : ₹ 3,127కోట్లు

ఇంధన రంగం : ₹ 8,207 కోట్లు

ఆర్ అండ్ బీ : ₹ 9,554 కోట్లు

యువజన, పర్యాటక, సాంస్కృతిక : ₹322కోట్లు

పోలీస్ శాఖ : ₹8,495 కోట్లు

పర్యావరణ, అటవీ శాఖ : ₹ 687 కోట్లు


సంక్షేమం రూ.4,376 కోట్లు
మహిళ, శిశు సంక్షేమం రూ. 4,285కోట్లు
మానవ వనరుల అభివృద్ధి రూ. 1,215కోట్లు
పాఠశాల విద్య రూ. 29,909కోట్లు
ఉన్నత విద్యకు 2,326 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ. 18,421కోట్లు
పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి రూ. 16,739 కోట్లు
పట్టణాభివృద్ధి రూ. 11,490 కోట్లు
గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు
జలవనరులు రూ. 16,705 కోట్లు
పరిశ్రమలు వాణిజ్యం రూ. 3,127కోట్లు
ఇంధన రంగం రూ. 8,207 కోట్లు
ఆర్ అండ్ బీ రూ. 9,554 కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతిక 322కోట్లు
పోలీస్ శాఖకు రూ. 8,495 కోట్లు
పర్యావరణ, అటవీ రూ. 687 కోట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement