గుంటూరు – తెలంగాణ తరహానే ఏపీని కేసీఆర్ అభివృద్ధి చేస్తారని బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని ఒక మోడల్ గా తీసుకుని అన్ని రాష్ట్రాల ను అభివృ ద్ధి లో నడిపించాలనే కేసీఆర్ ఈ పార్టీ పెట్టారని వెల్లడించారు. గుంటూరులో బిఆర్ ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మతతత్వ పార్టీ బీజేపీని దేశం నుండి తరిమి కొట్టాలంటే ఒక్క బిఆర్ఎస్ వల్లనే అవుతుందన్నారు..
ఏపీ అభివృద్ధి పథంలో వెనుకబడి ఉందని అంటూ దేశం లో అత్యధిక నిరుద్యోగం ఏపీలోనే కొనసాగుతుందని గుర్తు చేశారు. ..గత ఐదు సంవత్సరాలుగా ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర నుండి మనం రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకు రావటంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందని తెలిపారు. తెలంగాణా లో కేసీఆర్ మంచి పథకాలను తీసుకు వచ్చితెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని ప్రశంసించారు. . ఏపీ లో ఉన్న వనరులు తెలంగాణాలో లేకపోయినా అభివృద్ధిలో దేశఃలోనే ముందుందన్నారు. ఎపి ప్రభుత్వం ఆర్భాటాలు ఎక్కువ చేస్తున్నదిని, ఆచరణ శూన్యమని ఆరోపించారు…ఇంతవరకు రాజధాని నిర్మించుకోలేక పోయామరిచ. పోలవరం అర్ధాంతరంగా ఆగిపోయిందని అన్నారు.. ఈ సమస్యలకు పరిష్కారం దొరకాలంటే ఎపిలో కూడా బిఆర్ఎస్ అధికారంలోకి రావాలని ఆయన అభిలషించారు..