Tuesday, November 19, 2024

AP| జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియామకం…

అభివృద్ధి, సంక్షేమంపై ఫోక‌స్ పెట్టాలి
మంత్రుల‌కు ఇత‌ర జిల్లాల్లో బాధ్య‌త‌లు
సీఎం చంద్ర‌బాబు ఆదేశాలు
జిల్లా ఇన్‌చార్జిలుగా ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం
ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించాల‌న్న ముఖ్య‌మంత్రి
ఆయా జిల్లాల‌కు ఇన్‌చార్జి మంత్రులు వీరే..

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ:
ఏపీలో వివిధ జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించే బాధ్యతలను రాష్ట్ర‌ మంత్రులకు ప్రభుత్వం అప్పగించింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రులుగా తమ జిల్లాలోని అభివృద్ధి, సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించే బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర‌ ఎంఎస్ఎంఈ సెర్ప్, ఎన్ ఆర్ ఐ సాధికారిత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను శ్రీకాకుళం జిల్లా ఇన్ చార్జిగా నియమించారు.

పార్వ‌తీపురం ఇన్‌చార్జి మంత్రిగా అచ్చెన్న‌

వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెం నాయుడును పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ చార్జిగా, హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను విజయనగరం జిల్లా ఇన్ చార్జిగా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా వీరాంజనేయ స్వామిని విశాఖపట్నం జిల్లాగా, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్ చార్జిగా, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను అనకాపల్లి జిల్లా ఇన్ చార్జిగా, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణను కాకినాడ జిల్లా ఇన్ చార్జిగా, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును తూర్పు గోదావరి జిల్లా ఇన్ చార్జిగా, మత్స్యకార పరిశ్రమల శాఖ మంత్రి కింజరపు అచ్చెం నాయుడును ఇచ్చారు.

నాదెండ్ల‌కు కోన‌సీమ జిల్లా..

- Advertisement -

బాబా సాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ చార్జిగా, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను ఏలూరు జిల్లా ఇన్ చార్జిగా , ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ చార్జిగా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను ఎన్టీఆర్ జిల్లా ఇన్ చార్జిగా, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను కృష్ణాజిల్లా ఇన్ చార్జిగా, ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను పల్నాడు జిల్లా ఇన్ చార్జిగా , పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ ను గుంటూరు జిల్లా ఇన్ చార్జి గా, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ సారథికి కేటాయించారు.

బాప‌ట్ల బాధ్య‌త‌ల్లో ఆనం

బాపట్ల జిల్లా ఇన్ చార్జిగా, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డిని ప్రకాశం జిల్లా ఇన్ చార్జిగా, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం ఫరూక్ ను నెల్లూరు జిల్లా ఇన్ చార్జిగా, జలవనురల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ను కర్నూలు జిల్లా ఇన్ చార్జిగా, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ను నంద్యాల జిల్లా ఇన్ చార్జిగా, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ ను అనంతపురం జిల్లా ఇన్ చార్జిగా, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను శ్రీ సత్యసాయి జిల్లా ఇన్ చార్జిగా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితను కడప జిల్లా ఇన్ చార్జిగా, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన రెడ్డిని అన్నమయ్య జిల్లా ఇన్ చార్జిగా, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను తిరుపతి ఇన్ చార్జిగా , రవాణ శాఖ మంత్రి మందపల్లి రాంప్రసాద్ రెడ్డి ని చిత్తూరు జిల్లా ఇన్ చార్జిగా నియమించారు.


శ్రీకాకుళం – కొండపల్లి శ్రీనివాస్
పార్వతీపురం మన్యం, కోనసీమ – అచ్చెన్నాయుడు
విజయనగరం – వంగలపూడి అనిత
విశాఖపట్నం -బాలవీరాంజనేయ స్వామి
అనకాపల్లి – కొల్లు రవీంద్ర
అల్లూరి సీతారామరాజు జిల్లా – గుమ్మడి సంధ్యారాణి

కాకినాడ – నారాయణ
కర్నూలు, తూర్పు గోదావరి జిల్లా – నిమ్మల రామానాయుడు
ఏలూరు జిల్లా – నాదెండ్ల మనోహర్
పశ్చిమ గోదావరి, పల్నాడు – గొట్టిపాటి రవికుమార్
ఎన్టీఆర్ జిల్లా – సత్యకుమార్
కృష్ణా జిల్లా – వాసంశెట్టి సుభాష్
గుంటూరు – కందుల దుర్గేష్
ప్రకాశం – ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు – ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల – పయ్యావుల కేశవ్,
సత్యసాయి, తిరుపతి – అనగాని సత్యప్రసాద్
అనంతపురం – టీజీ భరత్
సత్యసాయి జిల్లా – బాపట్ల – పార్ధసారధి
కడప – సవిత
చిత్తూరు – రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య – బీసీ జనార్ధన్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement