Saturday, October 19, 2024

AP – మ‌రో ప్రేమోన్మాది ఘాతుకం.. యువ‌తిపై పెట్రోలు పోసి నిప్పు

బ‌ద్వేల్ – తనను ప్రేమించడం లేదని విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కడప జిల్లాలోని బుద్వేల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుద్వేల్ పట్టణంలోని రామాంజనేయ నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి శనివారం ఉదయం జాతీయ రహదారి 67పై నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఆమె సెంచరీ ఫ్లైవుడ్ షాప్ వద్దకు రాగానే ప్రేమోన్మాది విగ్నేష్ ఆ యువతిపై పెట్రోల్ పోశారు. అనంతరం ఆమె తేరుకునే లోపే నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన యువతిని బద్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు విగ్నేష్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement