Friday, November 22, 2024

వెదురుసాగుకు ప్రోత్సాహం, తమిళనాడులో పర్యటించిన ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి

అమరావతి, ఆంధ్రప్రభ : వెదురుసాగులో లాభదాయక పద్దతులు, రాష్ట్రంలో వివిధ నేలలకు సరిపడే టిష్యూ కల్చర్‌ వంగడాలకు గురించి తెలుసుకునేందుకు తమిళనాడులోని హోసూరులో ఉన్న గ్రోమోర్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన పరిశోధనా కేంద్రాన్ని సందర్శించినట్టు ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎం.వి.ఎస్‌ నాగిరెడ్డి తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు వీలుగా వెదురు మిషన్‌ (బాంబూ మిషన్‌)ను క్రియాశీలకం చేస్తున్నామని తెలిపారు.

దీనిలో భాగంగా గ్రోమోర్‌ బయోటెక్‌ ను సందర్శించి రాష్ట్రంలోని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన విషయాలపై వ్యవసాయ నిపుణులతో చర్చించినట్టు వెల్లడించారు. చెరకు, పత్తి పంటల ఉత్పాదకత పెంపుదలతో పాటు కొత్త వంగడాల రూపకల్పన, తెగుళ్ల నివారణపైనా చర్చించినట్టు నాగిరెడ్డి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement