ఇటీవల కాలంలో రకరకాలు వ్యాధులు వెలుగు చూస్తున్నాయి.. ఈ కొత్త తరహా రోగాలు సెలబ్రిటీలకు రావడంతో త్వరగానే ఈ రోగాలు పాపులర్ అవుతున్నాయి.. ఇప్పటి వరకు నవ్వు దివ్య ఔషధం అను కుంటన్న వాళ్లకు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి షాక్ ఇచ్చింది. ఆ నవ్వుతోనే తాను చాలా ఇబ్బంది పడుతున్నానంటూ వాపోయింది.. నవ్వు ఆపుకోలేని ఒక విచిత్రమైన సమస్యతో తాను ఉన్నట్లు పేర్కొంది.. ఒక్కసారి నవ్వితే… కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ఆమె నవ్వుతూనే ఉంటానని ఓ ఇంటర్వ్యూలో ఆమే స్వయంగా వెల్లడించింది. తాను నవ్వడం ప్రారంభిస్తే… షూటింగ్ ను కాసేపు ఆపేస్తారని అనుష్క తెలిపారు. తాను అటూ, ఇటూ తిరుగుతూ నవ్వుతూ ఉంటానని చెప్పారు. ఈ నవ్వు ఎందుకు వస్తుందో కూడా తనకు అర్ధం కావడం లేదంటున్నది జేజమ్మ..
Advertisement
తాజా వార్తలు
Advertisement