Wednesday, November 20, 2024

చిన్న చిన్న విషయాలకే యాంటీబయోటిక్స్‌ వాడుతున్నరు.. ఇది చాలా డేంజర్​ అంటున్న వైద్య నిపుణులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : చిన్న చితకా రోగానికీ యాంటీబయాటిక్స్‌ విచ్చలవిడిగా వాడడంతో తీవ్ర అనారోగ్యం పాలవ్వాల్సిన పరిస్థితులతోపాటు వ్యాధులు మరింత మొండిగా మారుతున్నరాయని పలు వైద్య అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. చివరి అస్త్రంగా వాడాల్సిన యాంటీ బయోటిక్స్‌ మందులను తొలిదశలోనే వాడేస్తుండడం ఇటీవలికాలంలో దేశంలో, రాష్ట్రంలో పెరిగిపోయిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యులు సూచించకపోయినా కొందరు సొంతంగా వాడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇష్టారాజ్యంగా యాంటీ బయాటిక్స్‌ వాడడంతో నిజంగా అవసరమైనప్పుడు వాడినా అవి పనిచేయని పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వ్యాధి నియంత్రణ తొలిదశలోనే యాంటీ బయోటిక్స్‌ వాడితే వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మక్రిములకు యాంటీబయాటిక్స్‌ ను తట్టుకునే శక్తి పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

దేశంలోని చాలా కాంబినేషన్‌ (రెండు మూడు రకాల యాంటీబయోటిక్స్‌ మందులను కలిపి వాడడం) యాంటీ బయాటిక్స్‌ను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. రెండు మూడు రకాల యాంటీబయాటిక్స్‌ను కలిపి వాడడం సరైంది కాదని హెచ్చరించింది. దీర్ఘకాలిక, మొండి రోగాలకు వాడాల్సిన కాంబినేషన్‌ మందులను చిన్న చిన్న రోగాలకు కూడా వాడుతున్నారని పలు వైద్య అధ్యయన నివేదికలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల యాంటీబయాటిక్స్‌ వినియోగం ప్రమాదకరస్థాయిలో ఉందని లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లోనూ కథనం ప్రచురితమైంది. ఒకటి అవసరమైన చోట రెండు రకాల మందులు వాడుతుండడంతో అసలు మందు పనిచేయకుండా పోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇన్‌ఫెక్షన్ల కారణంగానే యాంటీబయాటిక్స్‌ విచ్చలవిడిగా వాడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నరాయి. పారిశుధ్యం సరిగ్గా పాటించని, సబ్బుతో చేతులు కడుక్కోకపోవడం తదితర అపరిశుభ్రతా చర్యల కారణంగా ఇన్‌ఫెక్షన్లు వృద్ది చెందుతుండడంతో వాటి బారి నుంచి రక్షించుకునేందుకు ప్రజలు యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వాడుతున్నట్లు తెలుస్తోంది.

యాంటీబయాటిక్స్‌ వినియోగంలో జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ, రాష్ట్ర ఔషఁధ నియంత్రశాఖల మధ్య సమన్వయం లోపించడంతోనే విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ కౌంటర్‌ సేల్స్‌ జరిగిపోతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో పెద్ద ప రిమాణంలో యాంటీబయాటిక్స్‌ వినియోగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొవిడ్‌ మహమ్మారికి ముందు, ఆ తర్వాత అజిత్రోమైసిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌ ను విచ్చలవిడిగా వినియోగిస్తునర్నారు. వీటిలో అజిత్రో మైసిన్‌ అగ్రస్థానంలో ఉంది. మొత్తం యాంటీబయాటిక్స్‌ వినియోగంలో పది, పన్నెండు రకాల వే వినియోగంలో 75శాతాన్ని ఆక్రమించాయి. అత్యధికంగా అజిత్రోమైసిన్‌ను 12.6శాతం మేర 500 ఎంజీ ట్యాబ్లెట్ల రూపంలో, ఆ తర్వాత సైఫిక్సై మ్‌ ను 10.20శాతం మేర 200 ఎం జీ ట్యాబ్లెట్ల రూపంలో వినియోగిస్తున్న పరిస్థితులు నమోదవుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement