Friday, November 22, 2024

TG నోటీసుకు నోటీస్ తోనే సమాధానం… కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్

  • తాటాకు చప్పుళ్లకు అదిరేది లేదు
  • రాజ‌కీయంగా ఎదుర్కోలేకే నోటీసులు
  • కేటీఆర్‌ను చూస్తుంటే జాలేస్తోంది
  • మాట‌కు మాట‌, నోటీసుల‌కు నోటీసులే స‌మాధానం
  • కేటీఆర్ లీగ‌ల్ నోటీసుపై కేంద్ర‌మంత్రి బండి రియాక్ట్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, హైద‌రాబాద్ :
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపిన లీగన్ నోటీసులకు తాను భయపడేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. లీగల్ నోటీసులపై స్పందించిన ఆయ‌న అంతే దీటుగా రిప్ల‌య్ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ నాకు లీగల్ నోటీసులు పంపినట్లు మీడియా కథనాల్లో చూశాన‌ని, లీగల్ నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేర‌ని అన్నారు.

మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్ప‌ష్టం చేశారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీసు ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోంద‌ని చెప్పారు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదిలిచ్చానని, ఇక‌.. లీగల్ నోటీసులకు నోటీసులతోనే జవాబిస్తా కాచుకోవాలని స‌వాల్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement