Saturday, November 23, 2024

NEET UG | ఆ ప్ర‌శ్న‌కు రేప‌టిలోగా స‌మాదానం ఇవ్వాలి : సుప్రీంకోర్టు

నీట్-యూజీ 2024 పరీక్షా పత్రంలో చర్చనీయాంశమైన ఫిజిక్స్ ప్రశ్నపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నీట్ పరీక్ష పేపర్, లీకేజీ అవకతవకలపై సుప్రీంకోర్టు ఈరోజు (సోమవారం) విచారణ చేపట్టింది. గ్రేస్ మార్కులకు దారితీసిన ఫిజిక్స్ ప్రశ్నను పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఇచ్చారని, ఒకదానికి మాత్రమే మార్కులు కేటాయించారని, దానికి గ్రేస్ మార్కులు ఇచ్చినా, ఇవ్వకపోయినా మెరిట్ లిస్ట్ మారే అవకాశం ఉందని పిటిషనర్లు వాదించారు. దీనిపై స్పందించిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సరైన సమాధానం కోసం ముగ్గురు నిపుణులను నియమించింది.

రేపు (జూన్ 23వ తేదీన) మధ్యాహ్నం 12 గంటలలోపు గ్రేస్ మార్కులకు దారితీసిన ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని సమర్పించాలని ఢిల్లీ-ఐఐటీ డైరెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement