ప్రభన్యూస్ : మన జీవిత కాలంలో పదేండ్లతో సమానం లైక్‌ల కోసం ఎంతకైనా దిగజారే పరిస్థితి దెబ్బతింటున్న మానవ సంబంధాలు. చిన్నారులకూ అలవాటు చేస్తున్న పెద్దలు. ఒక్కొక్కరు రోజుకు సాంసరి రెండున్నర గంటలకు పైనే పిల్లల నుంచి వృద్ధుల వరకు సోషల్ మీడియాలో గడుపుతున్న క్షణాలు.. నిమిషాలయ్యాయి. కాలం మారుతున్న కొద్దీ అవి గంటలు అయ్యాయి. అంటే ప్రతి రోజు ప్రతిఒక్కరూ ఫోన్ చేసేందుకు 148 నిమిషాలు సమయం వెచ్చిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాతో గడుపుతున్న సమయంలో సగటున దాదాపు 65శాతం పెరిగింది. 2012లో రోజుకు సగటున 90 నిమిషాలు సెల్‌ఫోన్ వాడితే 2020నాటికి 148 నిమిషాలకు చెరింది. ఇండియాలో ఈ టైం 148నిమిషాలుగా ఉన్నట్లు లండన్ చెందిన పరిశోధనా సంస్థ తాగా చేసిన సర్వేలో ఈవిషయం వెల్లడైంది. సిమాన్ బొలివర్ యూనివర్సిటీకి చెందిన 1060 మంది విద్యార్థులపై శాస్త్రవేత్తలు అధ్యయనాలు జరిపి ఫలితాలు తెలిపారు.
ఇంటర్నెట్ డీ-ఎడిక్షన్ సెంటర్లు…
ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సర్వేలో సెల్ వీక్షణంలో చైనా అగ్రస్థానంలో ఉంది. ఆదేశంలో ఒంటరి జీవితాలు ఎక్కువగా కావడంతో యువత రెండేండ్ల క్రితమే స్థాయికి మించి సెల్ వినియోగిస్తుండటంతో అల్కాహాల్ తాగే వారికి డీ-ఎడిక్షన్ సెంటర్లు ఉన్నట్లు ఇంటర్నెట్ ఎడిక్షన్ సెంటర్లను ప్రారంభించే స్థాయి చేరింది.
ఫోన్‌లకు ప్రత్యేక బడ్జెట్…
ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒక్క ఫోన్ ఉండేది. కానీ ప్రస్తుతం ఎంత మంది ఉంటే అన్ని ఫోన్లు ఉండాల్సిందే. అది కూడా రెండు మూడేండ్ల మాత్రమే దీంతో ప్రస్తుతం కుటుంబ బడ్జెట్‌లో ఫోన్లకు ప్రత్యేకంగా కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది మధ్య తరగతి కుటుంబాల్లో.
ఏం చేయాలి..
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కరికీ సెల్ ఫోన్ అవసరమే కానీ ఎంత వరకు దీనిని ఉపయోగించుకుంటున్నామనేది పరీక్షించుకోవాలి . కుటుంబంలో అందరూ ఉన్నప్పుడూ కనీసం మాట్లాడుతున్నారా..? లేదా అప్పుడ ూఫోన్ చేస్తున్నారా గమనించాలి. ప్రతిరోజు మూడు గంటలకుపైగా సోషల్ మీడియాలో గడుపుతున్నామంటే నోమోఫోబి యా(మొబైల్ ఫోబియా)కు లోనైనట్లు ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే చేసేదుకు యత్నించాలి. చిన్నారులూ.. తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైల్‌కు బానిసలు చేస్తున్నారు. పనులకు అడ్డువస్తున్నారని కొందరు.. విసిగిస్తున్నారని మరికొందరు ఫోన్ ఇచ్చి ఆడుకోమంటున్నారు. దీంతో పిల్లలు ప్రమాదంలో పడుతున్నారు. నెలలు నిండుతున్నా మాట్లాడే ప్రయత్నం చేయడంలేదు. నగరంలో ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని ఈఎన్‌టీ వైద్యులు తెలుపుతున్నారు.
జీవితాల్లో పెను మార్పులు…
స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ జీవితాలను మార్చిసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచాన్ని దగ్గరగా పరిచయం చేయడంతోపాటు ప్రతిఒక్కరికి ఏది కావాలంటే అది చిటికెళ్లో అందిస్తున్నది. మరోవైపు ఆన్‌లైన్‌లో లైవ్ ద్వారా ఆత్మహత్య చేసుకునే దిక్కుమాలిన సంస్కృతిని అందించింది. అంతేకాక అత్మహత్య చేసుకుంటున్న వాడిని ఆపేద బదులు ఇంకెందుకు లేట్ అంటూ… పోస్టులు పెట్టే షాడిస్టులు సమాజాన్ని కూడా ఇదే సోషల్ మీడియా పరిచయం చేసిందంటే అతిశయోక్తి కాదేమో…
దెబ్బతింటున్న సంబధాలు..
ఒకప్పుడు టీవి తెచ్చిన తంటా ఇప్పుడు మొబైల్ తెస్తున్నదంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మధ్య తరగతి మొదలు ఉన్నత స్థాయి కుటుంబాలు కలిసిన కొద్ది కొణ్ణాలు తప్పా ఎవరూ పెద్దగా మాట్లాడుకోవడంలేదు. హాయి. బాయ్. పలకరింపులతోనే సరిపెడుతున్నారు. ఆ తర్వాత ఫోన్లలో తలలు దూర్చేస్తున్నారు. ఎవరికి ఫోన్ వారిదే ఎవరి లోకం వారిదే.. ముఖ్యంగా యువత ఇంటి సభ్యులతో కలువడంలేదు.
అతివాడకంతో అనారోగ్య సమస్యలు…
ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. ఇదిలేనిది రోజు గడవటం లేదు. స్మార్ట్ ఫోన్‌తోనే ఇంటి నుంచి అనేక పనులను చేసేస్తున్నాం. అయితే స్మార్ట్‌ఫోన్‌తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దాన్ని అధికంగా వాడితే అన్ని అనర్థాలున్నాయి. ప్రధానంగా స్థూలకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి సమస్యలు రావచ్చని లండన్‌కు చెందిన పరిశోధన సంస్థ తన పరిశోధనల్లె తెలిపింది. అంతేకాక ఆ సంస్థ విద్యార్థులు ఆహారపు అల వాట్లు, ఇతర జబ్బులు వివరాలనూ సేకరించింది. నిత్యం ఎన్నిగంటలు స్మార్ట్‌పోన్‌ను వాడుతున్నారన్న వివరాలనూ.. రాబట్టింది. చివరికి నిత్యం ఐదు గంటల కంటే ఎక్కువగా ఫోన్ వాడే విద్యార్థులు 44.6శాతం. అదే విద్యార్థినులైతే 59.04శాతం స్థూలకాయం బారిన పడే అవకాశం ఉందని చివర కి ఈ పరిశోధనలు తేల్చాయి. అంతే కాక స్మార్ట్‌ఫోన్ నుంచి వెలువడే నీలికాంతి కంటిలోని రెటీనా సామర్థ్యాన్ని దెబ్బతిసి దగ్గరి దృష్టి (మయోపియా)లోపాలి కలిగిస్తున్నదనివైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే సెల్‌ఫోన్ రేడియేషన్‌తో అనేక దుష్పరిమాణాలు తెలుత్తుతాయని నిద్రపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..