Saturday, November 23, 2024

virus from bats | గబ్బిలాల నుంచి మరో వైరస్.. థాయిలాండ్‌లో గుర్తింపు

గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదమున్న మరో కొత్త వైరస్‌ థాయిలాండ్‌లో వెలుగుచూసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సబ్‌వేరియంట్‌ జేఎన్‌.1 వణికిస్తున్న వేళ… ఈ కొత్త రకం వైరస్‌ కూడా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదం ఉన్న కొత్త వైరస్‌ను థాయ్‌లాండ్‌లో గుర్తించినట్లు న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎకోహెల్త్‌ అలయన్స్‌ అనే పరిశోధణా సంస్థ తెలిపింది.

దీన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశంలో శాస్త్రవేత్త డాక్టర్‌ పీటర్‌ దస్జాక్‌ వెల్లడించారు. కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం తాజాగా గుర్తించిన కొత్త వైరస్‌కూ ఉందన్నారు. థాయ్‌లాండ్‌లో ఓ గుహలోని గబ్బిలాల్లో దీన్ని గుర్తించినట్లు చెప్పారు. స్థానిక రైతులు ఈ గుహ నుంచి గబ్బిలాల ఎరువును పంట పొలాల్లో ఉపయోగిస్తున్నారని తెలిపారు.

ఎరువులోనే ఈ వైరస్‌ ఉన్నట్లు వెల్లడించారు. మనుషులతో తరచూ కాంటాక్ట్‌లోకి వస్తున్న ఈ వైరస్‌ భవిష్యత్‌తో అత్యవసర పరిస్థితులను తీసుకొచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా కరోనా సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు ఆందోళనకర రీతిలో పెరిగాయి. డిసెంబర్‌లో దాదాపు 10వేల మరణాలు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్‌లో వెలుగు చూసిన కొత్త వైరస్‌పై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement