ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో భాగంగా ఇవ్వాల జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించింది. ఈ టోర్నీలో బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్ రసవత్తంగా సాగింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించింది. మొదట బ్యాటింగ్ చేసి యూపీ ముందు 198/3 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేసిన ఆర్సీబీ.. యూపీ వారియర్స్ ను 175/8 పరుగులకే పరిమితం చేసి 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
యూపీ వారియర్స్ సారధి అలిస్సా హీలీ (55) హాఫ్ సెంచరీతో మెరిసింది. ఇక దీప్తి శర్మ (33), పూనమ్ ఖేమ్నార్ (31) పరుగులతో పరువాలేదనిపించారు. మిగిలినవారు ఘోరంగా విఫలమయ్యాయి. ఆర్‌సీబీ బౌలర్లలో సోఫీ మోలినక్స్, సోఫీ డివైన్, జార్జియా వేర్‌హామ్, ఆశా శోబన చరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగగులు చేసింది. ఆర్‌సీబీ సారధి స్మృతి మంధాన (50 బంతుల్లో 80 పరుగులతో), ఎల్లీస్ పెర్రీ (37బంతుల్లో 58పరుగులతో) హాఫ్ సెంచరీతో చెలరేగారు. ఇక, సబ్భినేని మేఘన (28), రిచా ఘోష్ (నాటౌట్ 21 ) తో ఆకట్టుకున్నారు. ఇక యూపీ బౌలర్లలో అంజలి సర్వాణి, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.