Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ Alert : బంగాళాఖాతంలో మరో వాయు’గండం’

Alert : బంగాళాఖాతంలో మరో వాయు’గండం’

0
Alert : బంగాళాఖాతంలో మరో వాయు’గండం’
  • ఏపీకి పొంచి ఉన్న వాన ముప్ప‌
  • ద‌క్షిణ కోస్తా, రాయ‌ల‌సీమ‌ జిల్లాల్లో భారీ వర్షాలు
  • త‌మిళ‌నాడు, శ్రీ‌లంక తీరాల‌కు అల‌ర్ట్‌
  • హెచ్చ‌రిక‌లు జారీ చేసిన అధికారులు


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్​కు మరో ముప్పు పొంచి ఉంది. హిందూ మహా సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరోసారి ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో శ‌నివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 12వ తేదీలోపు తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరువవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

దీని ప్రభావంతో ఈనెల 12వ తేదీన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాతే దానిపై స్పష్టత వస్తుందని అంటున్నారు.

Exit mobile version