Tuesday, November 26, 2024

ఝూర్ఖండ్‌లో మరో ఘోరం.. భార్యను 50 ముక్కులుగా కోసిన భర్త

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లి శ్రద్దా వాకర్‌ ఘటన మరిచిపోకముందే అంటేదే మరో ఘోరం వెలుగు చూసింది. ఝార్ఖండ్‌లో భార్యను 50 ముక్కులుగా కోసి దారుణంగా హతమార్చిన ఆమె భర్తను పోలీసులు అదపులోకి తీసుకున్నారు. అత్యంత హేయమైన ఈ సంఘటన ఝూర్ఖండ్‌లోని సాహెబ్‌గం జ్‌ జిల్లా బోరియో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో 12 శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. మిగతా వాటి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు రుబికా పహాదిన్‌ (23)తో దిల్దార్‌ అన్సారీ (28) అనే వ్యక్తి రెండేళ్లుగా సహజీవనం చేసి ఇటీవలే ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రలోభానికి గురి చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెల్సింది.

అతడికి ఇది రెండో వివాహం. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్‌ కంప్లయింట్‌ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం సంతాల మోమిన్‌ తోలా ప్రాంతంలో ఓ పాత ఇంటి సమీపంలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. పోలీస్‌ జాగిలాల సహకారంతో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రుబికా పహాదిన్‌ను చంపిన తరువాత శరీర భాగాలను ఎలక్ట్రిక్‌ కట్టర్‌ లాంటి పదునైన ఆయుధాన్ని వాడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కిరాతకం వెనుక మరికొంత మంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement