అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ప్రచండభానుడు ప్రతాపం చూపాడు. ఎండ భగభగలతో పాటు వేడిగాలులతో ప్రజలు అల్లాడిపోయారు. అత్యధికంగా గన్నవరంలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అమరావతిలో 43.8, నందిగామలో 43.5, మచిలీపట్నంలో 42.2, జంగమేశ్వరపురంలో 41.5, బాపట్లలో 40.1, బాపట్ల 40, అనంతపురంలో 36.5, కడపలో 36.2, కాకినాడలో 38.4, కళింగపట్నంలో 32.7, కర్నూలులో 38, నెల్లూరు 38.5, తిరుపతి 38.8, విశాఖపట్నం 33.2, కావలి 37.6, నర్సపూర్ 39.2, తుని 35.8, నంధ్యాల 39.3, విశాఖపట్నం 35.2, ఆరోగ్యవరం 34.5 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాగల మూడు రోజులలో ఉత్తర, దక్షిణ కోస్త, మరియు యానాంలో గరిష్ట ఉష్ణో గ్రతలు సగటు- ఉష్ణో గ్రతల కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీ-గ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమలో గరిష్ట ఉష్ణో గ్రతలు సగటు- ఉష్ణో గ్రతల కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీ-గ్రేడ్ అధికం గా నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ యానం ప్రాంతాల్లో గురు,శుక్ర వారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ఈదురు గాలులు గంటకు 30- 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
తూర్పు మధ్య బంగాళాఖాతం నుండి నైరుతి బంగాళాఖాతం వరకు తమిళనాడు తీరంలో ఏర్పడిన ద్రోణి సగటు- సముద్ర మట్టమునకు 3.1 కి.మీ మరియు 4.5 మధ్య కొనసాగుతున్నది. అక్షాంశం 11.0 వెంబడి, దక్షిణ ద్వీపకల్ప భారత దేశము మీదుగా ద్రోణి సగటు- సముద్ర మట్టమునకు 4. 5 మరియు 7. 6 కి మీ మధ్య కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.