Thursday, November 21, 2024

మైక్రోసాఫ్ట్‌ నుంచి మరో సూపర్‌ యాప్‌

ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్‌ సూపర్‌ యాప్‌ను నిర్మించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ యాప్‌లో షాపింగ్‌, మెసేజింగ్‌, వెబ్‌ సెర్చ్‌, న్యూస్‌ ఫీడ్‌, ఈ-కామర్స్‌ ఇలా అనేక ఫీచర్లు ఇందులో తీసుకురావాలని నిర్ణయించినట్లు తెల్సింది. వినియోగదారుల సేవల్లోకి విస్తరించాలనే లక్ష్యంతోనే కంపెనీ ఈ సూపర్‌ యాప్‌ను తీసుకు వస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ యాప్‌ ద్వారా ప్రకటనల ఆదాయం పెంచుకోవడంతో పాటు, టీమ్స్‌ మెసేజింగ్‌ సహా ఇతర మైక్రోసాఫ్ట్‌ మొబైల్‌ సేవలకూ యూజర్లు పెరుగుతాయరని కంపెనీ భావిస్తోంది. యాపిల్‌, గూగుల్‌ తరహాలో మైక్రోసాఫ్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల కోసం ఎలాంటి యాప్‌ను నిర్వహించడంలేదు. ఇప్పుడు అన్ని రకాల సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకు వస్తే వివిధ రకాల సేవలకు విభిన్న యాప్‌లను వినియోగదారులు ఆశ్రయించాల్సిన అవసరం ఉండదని మైక్రోసాఫ్ట్‌ భావిస్తోంది.

చైనాకు చెందిన టెన్సెంట్‌ సంస్థ వీచాట్‌ పేరుతో సూపర్‌ యాప్‌ను నిర్వహిస్తోంది. ఇందులో మెసేజింగ్‌, షాపింగ్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌, వార్తలు, సరకులను ఆర్డర్‌ ఇలా అనేక అంశాలు ఒకే యాప్‌లో ఉన్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ కూడా ఇదే తరహాలో సూపర్‌ యాప్‌ను తీసుకు వచ్చే ప్రయత్నాల్లో ఉందని సంబంధి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రముఖ కంపెనీలు తమ సేవలన్నీంటిని ఒకే వేదికపైకి తీసుకు వచ్చేందుకు వీలుగా యాప్‌లను తీసుకు వస్తున్నాయి. మన దేశంలో ఇప్పటిక రిలయన్స్‌ జియో, టాటా సన్స్‌ ఇలాంటి యాప్‌లను నిర్వహిస్తున్నాయి. అదానీ గ్రూప్‌ సైతం తాము సూపర్‌ యాప్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ట్విటర్‌ను కూడా ఎలాన్‌ మస్‌ ్క వీచాట్‌ తరహాలోనే మార్చనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement