టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేము ధైర్యంగా ఆట కొనసాగించాం. మొదటి పవర్ ప్లేలో ఏకంగా 80 పరుగులు వచ్చాయి. కొన్నిసార్లు వికెట్లు కోల్పోయాక ఇన్నింగ్స్ పునర్నిర్మించుకోవాల్సి ఉంటుంది. మేము రక్షణాత్మక ధోరణితో ఆడలేదు.
రోహిత్ శర్మ ఓ అసాధారణ లీడర్. టీం విజయాలకు తన శక్తియుక్తులన్నీ కేటాయిస్తాడు. అయితే, టోర్నీ మొదలైననాటి నుంచి టీమిండియా, అభిమానులకు ఎన్నో మర్చిపోలేని క్షణాలను అందించింది. రోహిత్ సేన విచారంలో కూరుకుపోయింది. డ్రెసింగ్ రూంలో వారి స్థితి చూడటం ఓ కోచ్‌గా నాకు ఎంతో కష్టంగా అనిపించింది. కానీ మరో సూర్యోదయం వస్తుంది. క్రీడాకారులుగా మేము జయాపజయాలకు అతీతంగా ముందడుగు వేస్తాం అని రాహుల్ చెప్పుకొచ్చాడు.