అమెరికాలో ఏదో ఒక చోట కాల్పుల కలకలం రేగుతూనే ఉంది. గడిచిన సంవత్సర కాలంలో ఈ సంఖ్య భారీగా పెరిగింది. ఎంతో మంది అమాయక ప్రజలు బలయ్యారు. అక్కడి ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా పరిస్థితి సద్దుమనగడం లేదు. తాజాగా మరోసారి అమెరికాలో కాల్పుల జరిగాయి. ఉటా ప్రావిన్స్‌లో బుధవారం రాత్రి జరిగిన కాల్పుల్లో 8 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఎనోచ్ సిటీలోని ఓ ఇంట్లో జరిగినట్లు స్థానిక పోలీసుల సమాచారం. అందరి శరీరాలపై బుల్లెట్లు దిగిన గుర్తులు ఉన్నాయని, ఎవరు ఏ ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడి ఉంటారో తెలియరాలేదు. పోలీసుల తనిఖీల సందర్భంగా మృతదేహాలు బయటపడ్డాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తున్నది. వీరిని ఎవరు కాల్చి చంపారనేది తెలుసుకునేందుకు ఉటా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement