అమరావతి, ఆంధ్రప్రభ:రాష్ట్ర ప్రభుత్వం అర్బీఐ నుంచి మరో రూ.2వేల కోట్ల రుణం తీసుకుంది. సెక్యూరిటీ బాండ్ల వేలంలో రూ.వెయ్యి కోట్లు 20 ఏళ్లకు 7.42 శాతం వడ్డీతో రుణం తీసుకోగా.. మరో రూ. 5 వందల కోట్లు 18 ఏళ్లకు 7.42 శాతం వడ్డీతో అప్పు తీసుకుంది. మరో రూ.5 వందల కోట్లు 16 ఏళ్లకు 7.43 శాతం వడ్డీతో అప్పు తెచ్చింది. ఎఫ్‌ఆర్‌బీఎంలో ప్రభుత్వం ఈ ఏడాది రూ.22,500 కోట్ల అప్పు తెచ్చింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం రుణ పరిమితిలో రూ.8 వేల కోట్లే మిగిలాయి. 84 రోజుల్లో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం రూ.22,500 కోట్ల అప్పు చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement