Sunday, November 3, 2024

రష్యాతో మరో దఫా చర్చలు.. ప్రతిపాదించిన ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా బలగాలపై ఉక్రెయిన్‌ సైనిక బలగాలు కూడా ధీటుగానే ప్రతిఘటిస్తున్నాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్‌ రష్యాతో మూడో సారి చర్చలకు సన్నద్ధం అవుతున్నది. రష్యాతో యుద్ధం చేస్తూనే.. మరోవైపు శాంతిపరమైన చర్చలకు ఉక్రెయిన్‌ పిలుపునిచ్చింది. ఇప్పటికే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో చర్చించేందుకు ముందుకు వచ్చారు. నేడు (ఆదివారం) రష్యా అధికారులతో మూడో సారి శాంతి చర్చలకు ఉక్రెయిన్‌ సిద్ధం అవుతున్నది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సలహాదారు శనివారం వెల్లడించారు.

ఇదివరకే రెండు సార్లు పోలిష్‌ సరిహద్దు సమీపంలో బెలారస్‌లో చర్చలు జరపగా.. ఫలితాలివ్వలేదు. వివాదానికి రాజకీయ పరిష్కారానికి సంబంధించి ఇరుపక్షాల వైఖరి స్పష్టంగా ఉందన్నారు. పౌరుల తరలింపు కోసం సురక్షితమైన కారిడార్లను నిర్మించడానికి రష్యా-ఉక్రెయిన్‌ తాత్కాలిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ధృవీకరించారు. తరువాతి చర్చలు ఉక్రెయిన్‌ పార్లమెంట్‌లకు లోబడి ఒప్పందాలు కుదురొచ్చని రష్యా సీనియర్‌ పార్లమెంటేరియన్‌ లియోనిడ్‌ స్లట్‌ స్కీ అన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు ముచ్చటగా మూడో సారైన ఇరు దేశాల మధ్య చర్చలు ఫలితాలు ఇస్తాయో.. లేదో చూడాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement