టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఖాతాలో మరో రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో వరుసగా 13 విజయాలు సాధించిన తొలి కెప్టెన్‌గా హిట్ మ్యాన్ నిలిచాడు. రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంకను వరుసగా టీమిండియా క్వీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో విజయం సాధించింది.
హార్దిక్ అరుదైన రికార్డు..
తొలుత బ్యాటింగ్‌లో అర్ధసెంచరీతో రాణించగా, తర్వాత బౌలింగ్‌లో 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే పాండ్యా అరుదైన రికార్డు సాధించాడు. ఒకే మ్యాచ్‌లో అర్థశతకం చేయడంతోపాటు మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన రెండో భారత ఆటగాడిగా చరిత్ర పుటలకెక్కాడు. ఇంతకుముందు 2009-10లో మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. 25 బంతుల్లోనే 60 పరుగులు చేయడంతోపాటు 3 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత హార్దిక్ పాండ్యా ఆ ఫీట్‌ని తిరగరాశాడు.
ఎంట్రీలోనే అర్ష్‌దీప్ అదుర్స్..
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అర్ష్‌దీప్ సింగ్ అరంగేట్రంలోనే అదరహో అనిపించాడు. ఒక మెయిడెన్ ఓవర్ వేసి… 16ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.