టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్ ఆస్ట్రేలియపై ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదాడు. దాంతో, ఒకే ఏడాది మూడు ఫార్మాట్ల లో సెంచరీ కొట్టిన 10వ ఆటగాడిగా, నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలో (జనవరి 15, 2023 నుండి), అతను మూడు ఫార్మాట్లలో ఐదు అంతర్జాతీయ సెంచరీలు చేశాడు.
ఇలాగైతే 10వేలు ఖాయం: గవాస్కర్
టెస్టుల్లో రెండవ సెంచరీ పూర్తిచేసుకున్న శుభ్‌మన్‌గిల్‌పై దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడు ఇలాగే ఆడితే భవిష్యత్‌లో టెస్టుల్లో పది వేల పరుగులు సాధించగలడు. మిచెల్ వంటి పేసర్లను ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. అతడి ఆటతీరు ముచ్చట గొలుపేస్తోంది. గిల్ ఇంకా కుర్రాడే. అతడికి మంచి భవిష్యత్ ఉంది. ముందుకొచ్చి మరీ డిఫెన్స్ ఆడేతీరు అద్భుతం. కేవలం బ్యాక్‌ఫుట్ మీదే కాకుండా ఫ్రంట్‌ఫుట్‌లోనూ తేలిగ్గా ఆడేస్తున్నాడు. టెస్టు క్రికెట్‌కు ఈ టెక్నిక్ చాలా అవసరం. బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌ను సరిగ్గా అంచనా వేస్తూ ముందుకు సాగడం ఓ బ్యాటర్‌కు గొప్ప విషయం అని గవాస్కర్ ప్రశంసించారు.