Saturday, November 23, 2024

రికార్డులు బ‌ద్ద‌లుకొడుతున్న రో”హిట్”.. రోహిత్ ఖాతాలో మరో రికార్ అదేంటంటే..

శ్రీలంక తో జ‌రిగిన టీ20 సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ ల‌లో విజ‌యం సాదించి హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ తో సిరీస్ కైవసం చేసుకుంది భారత జట్టు. భారత్- శ్రీలంక మధ్య టీ20 సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్ ధర్మశాలలో ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ శంక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది శ్రీలంక‌.. అయితే టీమిండియా 147 పరుగుల లక్ష్యాన్ని 19 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. న్యూజిలాండ్, వెస్టిండీస్ తర్వాత శ్రీలంకను కూడా క్లీన్ స్వీప్ చేసి హ్యాట్రిక్ రికార్డ్ సృష్టించింది భార‌త్.

కాగా, ఈ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మకు 125వ టీ20 మ్యాచ్‌. దీంతో ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా హిట్‌మ్యాన్ మ‌రో రికార్డ్ క్రియేట్ చేసాడు. ఈ మ్యాచ్‌ ముందు వరకు పాకిస్తాన్ ప్లేయర్ షోయబ్ మాలిక్ 124 టీ20లు ఆడాన ప్లేయ‌ర్ గా నంబర్‌ వన్ స్థానం ఉన్నాడు. నేటి మ్యాచ్‌తో రోహిత్ పాక్ ప్లేయర్‌ను వెనక్కు నెట్టి తొలిస్థానంలో నిలిచాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement