Friday, November 22, 2024

ఐపీల్ 2022 ఫైన‌ల్ మ్యాచ్ లో మ‌రో రికార్డ్… ఫాస్టెస్ట్ బౌల‌ర్ గా ఫెర్గ్యూసన్..

ఐపీఎల్ 2022 ఫైనల్‌లో ఓ కొత్త రికార్డు తెరపైకి వచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో లోకీ ఫెర్గ్యూసన్.. ఉమ్రాన్ మాలిక్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఐపీఎల్ ఫాస్టెస్ట్ బౌలర్ ఎవరంటే ఠక్కున ఉమ్రాన్ మాలిక్ పేరు చెప్తాం. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన‌ ఉమ్రాన్ మాలిక్.. ఈ సీజన్‌‌‌‌లో అత్యధిక ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. సన్‌రైజర్స్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడితే.. ఆడిన 14 మ్యాచ్‌లలోనూ ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డును ఉమ్రాన్ సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా 157 kmphతో ఫైనల్ ముందు వరకు ఫాస్టెస్ట్ బౌలర్ల జాబితాలో టాప్‌లో నిలిచాడు ఉమ్రాన్ మాలిక్.

అయితే, ఫైనల్ మ్యాచ్‌లో ఆ అద్భుత రికార్డ్ బ్రేక్ అయింది.. గుజ‌రాత్ త‌రుపున ఆడుతున్న‌ ఫెర్గ్యూసన్ తాను వేసిన తొలి ఓవర్‌లోనే ఉమ్రాన్ మాలిక్ రికార్డును బ్రేక్ చేసి 157.3kmph స్పీడ్ తో బంతిని విసిరాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వేగంతో బంతిని విసిరిన ఆటగాడిగా షాన్ టైట్ పేరిట ఉన్న ఈ రికార్డును లోకీ ఫెర్గ్యూసన్ సమం చేశాడు. ఆ తర్వాతి స్థానంలో ఉమ్రాన్ మాలిక్ కొనసాగుతున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement