Saturday, November 23, 2024

ఉస్మానియాకు మరో గుర్తింపు, జాతీయ స్థాయి ఉత్తమ విద్యా సంస్థల్లో చోటు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జాతీయ స్థాయిలో ఉస్మానియా విశ్వ విద్యాలయం మరో గుర్తింపును సాధించింది. జాతీయస్థాయి విద్యా సంస్థలు, యూనివర్సిటీల స్థానంలో మరింత మెరుగైన స్థానానికి ఎదిగింది. గతేడాదితో పోలిస్తే పది స్తానాలు మెరుగుపరుచుకుని 22వ స్థానాన్ని సాధించింది. 2022కుగాను కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ విడుదల చేసిన అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఓయూ చోటు సంపాదించుకుంది. ఆయా విద్యా సంస్థలు సాధించిన ప్రగతి ఆధారంగా ఎంహెచ్‌ఆర్డీ కోర్‌ కమిటీ అధ్యయనం చేసింది. బోధన, అభ్యాసం, వనరులు, పరిశోధన, వృత్తి, నైపుణ్య పద్దతులు, పట్టభద్రతా సాఫల్యం, భిన్న వర్గాలకు అందుబాటులో ఉండడం, సమాజం పట్ల విద్యా సంస్థ అవగాహనా అంశాలు తదితర పాయింట్ల వారీగా రేటింగ్‌లను ప్రకటించింది. ఈ రేటింగ్స్‌ లో ఓయూ కేంద్రీయ విశ్వ విద్యాలయంతో పోటీ పడింది. ఏడాది కాలంగా ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టిన సంస్కరణల ఫలితాలనిచ్చాయని వీసీ ప్రొ. రవీందర్‌ యాదవ్‌ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement