ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం. ప్రస్తుతం నైజీరియా పర్యటనలో ఉన్న మోదీని ఆ దేశం అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. నైజీరియా అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద నైజర్’ని ప్రకటించారు.
కాగా, 1969లో, క్వీన్ ఎలిజబెత్కు కూడా నైజీరియా GCON అవార్డును అందజేసింది. క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఈ అవార్డును అందుకున్న రెండో వ్యక్తి మోదీ కావడం విశేషం. ఇక ఈ అవార్డుతో భారత ప్రధానికి విదేశాల నుంచి వచ్చిన పురస్కారాల సంఖ్య 17కు చేరింది.