ర్యాష్ డ్రైవింగ్ కారణంగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డిలోని కోకాపేట్ సర్వీస్ రోడ్డులో అతివేగంతో వచ్చిన ద్విచక్రవాహనం డివైడర్‌ను ఢీకొనడంతో విద్యార్థి మృతి చెందాడు… మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు సాత్విక్ అనే విద్యార్థిగా గుర్తించారు.
మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.
హైస్పీడ్ లో బుల్లెట్ బైక్.. ఇద్దరు దుర్మరణం..
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు టెక్కీలు మృతి చెందారు. బోరబండకు చెందిన బాధితులు రఘుబాబు, ఆకాంక్ష్ లు… అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్ రోడ్డుపై జావా బైక్‌పై వేగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.