కేంద్రం తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఏపీలోని వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు 255 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారు. రూ. 4,706 కోట్ల వ్యయంతో ఈ రహదారిని నిర్మించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఇప్పటికే కృష్ణానదిపై బ్రిడ్జ్ నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ల ప్రక్రియను చేపట్టింది. ఇప్పుడు నాలుగు లేన్ల రహదారి నిర్మాణాన్ని చేపట్టబోతోంది. ఈ జాతీయ రహదారిని తెలంగాణలో 91 కిలోమీటర్లు, ఏపీలో 164 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. 2023 ఫిబ్రవరి తొలి వారంలో టెండర్ల ప్రక్రియను చేపట్టి ఏడాదిన్నర కాలంలో పూర్చి చేయాలని కేంద్రం భావిస్తోంది. మొత్తం ఏడు ప్యాకేజీల కింద రహదారి నిర్మాణాన్ని చేపట్టనున్నారు.