హైదరాబాద్, ఆంధ్రప్రభ: నీటి చుక్కలను ఒడిసిపట్టి ప్రాజెక్టుల్లో పదిల పరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోప్రాజెక్టు ప్రారంభోత్సవానకి సిద్ధమైంది. విప్లవోద్యమ నాయకత్వానికి ముందువరుసలో నిలిచిన అనేక ప్రాంతాలు తెలంగాణ ప్రభుత్వంలో పోరుబాట నుంచి పొలం బాట పడుతున్నాయి. దశాబ్దాల తరపడి ఎండిన పంటచేనులతో కాలంవెల్లదీసిన కర్షకులు, హక్కులసాధనకోసం ఆందోళన బాట పట్టిన రైతుకూలీలు గతం ఒకపీడకలగా భావించి గలగల పారుతున్న గోదావరిజలాలతో పంటపొలాల పనుల్లోనిమగ్నం అవుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ కల్లోలిత ప్రాంతాల్లో కాళేశ్వరం జలాలు పంటపొలాల్లో పరుగులు తీయడంతో ఎండిన భూములు జీవం పోసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతంలో నాటి పాలకులు మొక్కుబడిగా మొదలుపెట్టిన గౌరపల్లి రిజర్వాయర్ పునరుద్ధరించి వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. కాళేశ్వరం జలాలు దశలవారిగా ఎదురీది గౌరపల్లి రిజర్వాయర్ కు పరుగులు పెట్టే ఘడియలు దగ్గరకు వచ్చాయి. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరపల్లి రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించనున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ఈ ప్రాజెక్టు లక్షా ఆరువేల ఎకరాలకు నీరు అందించేందుకు సిద్ధమైంది.
హుస్నాబాద్ మండలంలోని గౌరవెల్లి దగ్గర నిర్మించిన ఈ రిజర్వాయర్ ఇంజనీరింగ్ నైపుణ్యత తెలంగాణ సాగునీటి రంగం కీర్తిన మరింత ఇనిమడింప చేస్తోంది. కాళేశ్వరం నుంచి మిడ్ మానేరు కు చేరుకునే గోదావరి జలాలు అక్కడి నుంచి ఎదురెల్లి బెజ్జంగి మండలం కొత్తపల్లి రిజర్వాయర్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి మూడు బాహుబలి మోటర్ల ద్వారా ఎదురెల్లి గౌరవెల్లి రిజర్వాయర్ చేరుకుంటాయి.గౌరవెల్లి నుంచి కుడి కాలువద్వారా 90వేలు, ఎడమ కాలువ ద్వారా 16వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఎదురుప్రవహంగా పరుగులు పెటిన గౌరవెల్లి
జలాశయం నుంచి అక్కన్న పేట, హుస్నాబాద్ మండలాల్లోని 15గ్రాలకు, కొహెడ మండలంలోని 8, చిగురుమామిడి మండలంలోని 10, బీమదేవరపల్లి మండలంలోని 12, ధర్మాసాగర్ మండలంలోని 13, ఘన్ పూర్ లోని 10, సైదాపూర్ లోని 3, హన్మకొండ, జాఫర్ ఘడ్, రఘునాథపల్లి మండలాల్లోని 5 గ్రామాలకు తాగునీటితోపాటు సంబంధింత గ్రామాల పరిధిలోని సాగుభూముల్లో కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కనున్నాయి.
గౌరవెల్లి ప్రాజెక్టును 2007లో నాటి నాటి సమైక్యపాలకులు మొక్కుబడిగా 1.4 ఎకరాల వరదనీటి కోసం ప్రాజెక్టును నిర్మించినా ఫలితాలు రాలేదు. సీఎం కేసీఆర్ ఉద్యమ వేళ ఈ ప్రాజెక్టు పరిసరాల్లో పర్యటించి తెలంగాణ ఏర్పడగానే ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపడతామని ఇచ్చిన హామీ మేరకు పనులు ప్రారంభించి 8.23 టీఎంసీ ల సామర్ధ్యంతో కాళేశ్వరం జలాల ఎదురీతతో నిర్మించారు. మంత్రి హరీష్ రావు ప్రత్యేక శ్రద్ధతో సీఎం కేసీఆర్ ఆదేశాలకు కార్యరూపం ఇచ్చారు. అలాగే ప్రాజెక్టును అడ్డుకోవాలని భూనిర్వాసితులతో కలిసి ప్రతిపక్షపార్టీలు చేసిన ఆందోళనలకు కలత చెందక ప్టటుదల తో పనులు పూర్తి చేశారు. భూనిర్వాసితులకు మార్కెట్ ధర చెల్లించడంతోపాటుగా గృహవసతి కల్పించారు.
ఇంజనీరింగ్ అద్భుతాలు..
గౌరవెల్లి రిజర్వాయర్ ఇంజనీరింగ్ అద్భుతాలకు నిలయంగా మారింది. దశలవారిగా కాళేశ్వరం జలాలను ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. దీనికోసం 130 మీటర్ల లోతులో 17 మీటర్ల వెడల్పు 85 మీటర్ల పోడవుతో సర్జీ పూల్ నిర్మించి మూడు భాహుబలి మోటర్లను బిగించారు. ఒక్కో మోటర్ 96 మెగాట్ల సామర్ధం కలిగి ఉంది. ఈ సర్జీ పూల్ చేరుకున్న నీటినిటి బాహుబలి మోటర్లు 126 మీటర్ల ఎత్తుకు నీటిని సరఫరాచేస్తాయి. ఒక్కో మోటరు సెకనుకు 2వేల క్యూసెక్కుల నీటిని పంప్ చేస్తాయి. రూ. 770కోట్ల ఖర్చుతో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు ఉత్తర తెలంగాణలో మరో అద్భుతంగా నిలుస్తోంది.
ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కొహెడ మండలం నారాయణ పూర్ గ్రామం నుంచి రేగొండ పంపుహౌసు వరకు 12 కి.మీ. సొరంగం నిర్మించారు. రేగొండ సమీపంలో రెండు సర్జిపూల్ ట్యాంకులు, పంపు హౌసులు నిర్మించారు. ఇక్కడ 132 విద్‌త్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసి పంపులను రన్ చేసేందుకు 50 ఎంవిఏ సామర్థ్యం గల 5 భారీ విద్యుత్ ట్రాన్స్ పార్మర్లు ఎర్పాటుచేశారు. అలాగే ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించారు. ఇక సీఎం కేసీఆర్ ప్రారంభించడమే మిగిలి ఉంది. అధికారుల
వివరాలమేరకు వారంలోగా ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించేందుకు సన్నహాలుచేస్తున్నారు.
ఎగబాకుతున్న కాళేశ్వరం జలాలు.. సముద్రాలవేణుగోపాల చారి. రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమైందని రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేణుగోపాల చారి చెప్పారు. కాళేశ్వరంతో తెలంగాణ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిందన్నారు. ఎక్కడ నీటి ఎద్దడి ఉన్నా కాళేశ్వరం జలాలను తరించేందుకు సాగునీటి పారుదలశాఖ ఇంజనీరింగ్ నైపుణ్యత ఉందన్నారు. అయితే ఉద్ధేశ పూర్వకంగా గత ఆంధ్రపాలకులు తెలంగాణను ఎడారిగా మార్చి వలసలకు నిలయం చేశారని చెప్పారు.
తెలంగాణలో కాకతీయుల కాలంనాటి లక్షల చెరువులను సమైక్యపాలకులు నాశనం చేశారన్నారు. సీఎం కేసీఆర్ ఒకవైపు చెరువుల పునరుద్ధరణ, మరోవైపు రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టడంతో తెలంగాణ కోటి 30 లక్షల ఎకరాల మాగాని అయిందన్నారు. ఎగువ ప్రాంతాలకు సాగునీరందించేందుకు గౌరవెల్లి ప్రాజెక్టు ఇంజనీరింగ్ విధానం మార్చి నిర్మించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎగువప్రాంతాల్లోని వేలాది ఎకరాలు సాగులోకి రానున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక గౌరవెల్లి ప్రాజెక్టు అని వేణుగోపాలచారి చెప్పారు. తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదగిందన్నారు.
………..