ఐపీఎల్ 16వ సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే 41 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అయితే.. ఈ సీజన్‌లో ఒక్కో ప్లేయర్ తమ ఆటతీరుతో అభిమానులను అలరిస్తూ.. పలు రకాల రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. కాగా, వేర్వేరు జట్లలో ఉన్న కింగ్ కోహ్లీ, ప్రిన్స్ శుభ్‌మన్ గిల్ మాత్రం ఓ డిఫరెంట్ రికార్డుని సెట్ చేశారు. అదేంటంటే.. వీరద్దరు ఆడిన మ్యాచులు ఎనిమిది.. అంతేకాకుండా వారి స్ట్రైక్ రేట్, పరుగులు కూడా సేమ్ టు సేమ్ మ్యాచ్ అవ్వడాన్ని అభిమానులు అద్భుతంగా భావిస్తున్నారు.
ఇద్దరు ప్లేయర్స్ ఒకే స్ట్రైక్ రేట్‌తో పాటు, ఒక్కో డకౌట్‌తో తిరిగి పెవెలియన్ చేరుకున్నారు. అంతే కాకుండ ఇద్దరూ 234 బంతులు ఆడారు. అయితే, కోహ్లి ఇప్పటివరకు ఈ సీజన్ లో ఐదు అర్ధ సెంచరీలు నమోదు చేయగా, యువ భారత సహచరుడు మూడు సందర్భాల్లో 50 పరుగుల మార్కును చేరుకున్నాడు. కాగా, గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం ఎనిమది మ్యాచ్ లు ఆడగా ఆరు మ్చాచ్ లు గెలిచి, రెండు ఓడిపోయింది. దీంతో IPL పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో ఉంది, అయితే RCB కూగా ఎనిమిది మ్యాచ్ లు ఆడగా.. నాలుగు మ్యాచ్ లు గెలిచి, నాలుగు మ్యాచ్ లో ఓడిపోవడంతో పాయింట్స్ టేబుల్ లో ఐదవ స్థానంలో ఉంది.
కాగా, ఈ సీజన్ ఐసిఎల్ లో విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ ఆడిన మ్యాచ్ లు…
విరాట్ కోహ్లీ–
8 మ్యాచెస్
8 ఇన్నింగ్స్
1 డక్ అవుట్
333 రన్స్
234 బాల్స్ ప్లేయిడ్.
142.30 స్రైక్ రేట్
శుభ్‌మాన్ గిల్-
8 మ్యాచెస్
8 ఇన్నింగ్స్
1 డక్ అవుట్
333 రన్స్
234 బాల్స్ ప్లేయిడ్.
142.30 స్రైక్ రేట్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు ఫ్రాంచైజీ మజీ కప్టెన్, భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లి. 2008లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు తన IPL కెరీర్‌లో 231 మ్యాచ్‌లు ఆడగా.. 36.62 సగటుతో 6957 పరుగులు చేశాడు. అంతే కాకుండ 5 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలు తన కాతాలో ఉన్నాయి. ఐపిఎల్ లో విరాట్ అత్యధిక స్కోరు 113 పరుగులు. విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్‌లో 609 ఫోర్లు, 229 సిక్సర్లు కొట్టాడు.
ఇక.. 2018లో IPL అరంగేట్రం చేశాడు శుభ్‌మాన్ గిల్. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాల్ టైటన్స్ తరుఫున ఆడుతున్నడు. అతను శుభమాన్ గిల్ తన IPL కెరీర్‌లో ఇప్పటి వరకు 82 మ్యాచ్‌లు ఆడాడు. 33.33 సగటుతో 2233 పరుగులు చేశాడు.