కామన్వెల్త్ గేమ్స్ గేమ్స్ లో భారత ఆటగాళ్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. బుధవారం హైజంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే.. తాజాగా గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో భారత్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ రజతం సాధించి చరిత్ర సృష్టించాడు. దీంతో CWGలో ఈ రెండు విభాగాల్లో భారత్‌కు పతకాలు సాధించిన అథ్లెట్స్‌గా వీరు రికార్డు సృష్టించాడు. గురువారం జరిగిన లాంగ్‌జంప్ ఫైనల్స్‌లో కేరళ యువకుడు మురళీ శ్రీశంకర్.. ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. ఇక బహమాస్‌కు చెందిన లకాన్ నైర్న్ స్వర్ణం గెలుచుకున్నాడు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో లాంగ్‌జంప్ విభాగంలో ఇది మూడో పతకం. ఇంతకముందు 2002 ,2010లో మహిళల లాంగ్ జంప్ విభాగంలో అంజూ బాబీ జార్జీ(కాంస్యం), ప్రజూషా మాలిక్కల్(రజతం) పతకాలు సాధించారు.
అయితే లకాన్ కూడా 8.08 మీటర్లే దూకినప్పటికీ.. అతని సెకండ్ బెస్ట్ అటెమ్ట్ (7.98 మీటర్లు) శ్రీశంకర్ (7.84 మీటర్లు) కంటే మెరుగ్గా ఉండడంతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల లాంగ్‌జంప్ విభాగంలో భారత్‌కు పతకం సాధించిన రెండో ఆటగాడిగా శ్రీశంకర్ నిలిచాడు. 1978లో కెనడాలో జరిగిన CWGలో సురేశ్ కాంస్యం గెలుపొందాడు. ఆ తర్వాత లాంగ్‌జంప్‌లో ఇండియాకు కామన్వెల్త్ పతకం లభించడం ఇదే మొదటిసారి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.