పారా ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల షూటింగ్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ ఫైనల్లో పారా షూటర్ మనీష్ నర్వాల్ అదరగొట్టాడు. మనీష్ మూడు రౌండ్లలో 234.9 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. దీంతో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక కొరియాకు చెందిన జియోంగ్డు జో స్వర్ణం సాధించగా, చైనా షూటర్ యాంగ్ చావో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకున్నాడు.
అంతకు ముందు….
మహిళల 100 మీ. టీ35 పరుగు పందెంలో ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సాధించింది. నిర్దేశిత లక్ష్యాన్ని ప్రీతి 14.21 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. దీంతో భారత్ మొత్తం 4 పతకాలను తన ఖాతాలో వేసుకుంది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్-1 షూటింగ్ విభాగంలో అవని లేఖర స్వర్ణం సాధించింది. ఇదే ఈవెంట్‌లో మోనా అగర్వాల్ కాంస్యం గెలుచుకుంది. ఓవరాల్‌గా భారత్ ఖాతాలో మొత్తం 4 పతకాలు ఉన్నాయి.