Saturday, November 23, 2024

మరో అతి పెద్ద బ్యాంకింగ్‌ ఫ్రాడ్ .. 34,615 కోట్లు మోసగించిన డిహెచ్‌ఎఫ్‌ఎల్‌

బ్యాంకింగ్‌ రంగంలో మరో ఘరాన మోసం వెలుగులోకి వచ్చింది. దివాన్‌ హౌస్సింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌( డిహెచ్‌ఎఫ్‌ఎల్‌) ఏకంగా బ్యాంక్‌లకు 34,615 కోట్లు మోసగించి నట్ల వెల్లడైంది. నిధులను మళ్లించడం, వాటిని స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసినట్లు ఆడిట్‌లో గుర్తించారు. సంస్థ మాజీ సీఎండి కపిల్‌ వాద్వాన్‌, డైరెక్టర్‌ ధీరజ్‌ వాద్వాన్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరు బ్యాంక్‌ల నుంచి పొందిన రుణాలను దారిమళ్లించి సొంత ఆస్తులు పెంచుకునేందుకు దుర్వినియోగం చేశారని వెల్లడైంది.
జూన్‌ 20న సీబీఐకి చెందిన 50 మంది అధికారులు సంస్థకు చెందిన 12 కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. వీరితో పాటు ప్రముఖ రియల్టర్‌ సుధాకర్‌ శెట్టి, మరో 10 మంది పై కూడా కేసు నమోదైంది. యూనియన్‌ బ్యాంక్‌ వీరిపై ఫిర్యాదు చేసింది.
2010 , 2018లో యూనియన్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో 17 బ్యాంక్‌లు, సంస్థలు కలిసి డిహెచ్‌ఎల్‌ఎఫ్‌కు 42,871 కోట్లు రుణ ంగా ఇచ్చాయి. కపిల్‌ , ధీరజ్‌ ఇద్దరు

కుట్రతో నిధులను దారిమళ్లించారని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి స్వార్దానికి వాడుకున్నారని, సొంత ఆస్తులు పెంచుకున్నారని, బ్యాంక్‌లకు 2019 నుంచి రుణాలు చెల్లించడంలేదని యూనియన్‌ బ్యాంక్‌ ఫిర్యాదు చేసింది. దీంతో ఆడిట్‌ నిర్వహించి, డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఉద్దేశ్యపూర్వకంగానే అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. అకౌంట్స్‌ బుక్స్‌లో అనేక తప్పుడు లెక్కులు, కొన్ని అంకెలను సరి చేయడం వంటివి వెలుగులోకి వచ్చాయి. సంస్థపై 2019లో ఫిర్యాదు రావడంతో ఆడిటింగ్‌ బాధ్యతలను కేపీఎంజీ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ 2015, ఏప్రిల్‌ 1 నుంచి 2018, డిసెంబర్‌ 31 వరకు ఉన్న సంస్థ అకౌంట్స్‌ను ఆడిట్‌ చేసింది. ఈ ఆడిట్‌లో అనేక లోపాలు, లొసుగులు, నిధులను ఎలా దారిమళ్లించింది వెలుగులోకి వచ్చాయి.
అక్రమాలు వెలుగు చూడడంతో బ్యాంక్‌లు సంస్థపై ఫిర్యాదు చేయడంతో పాటు, కపిల్‌, ధీరజ్‌ దేశం విడిచి వెళ్లకుండా లూక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement