Friday, November 22, 2024

TG | పొంచిఉన్న‌ మరో అల్పపీడనం… రాష్ట్రంలో భారీ వర్షాలు !

రాష్ట్రవ్యాప్తంగా వారం, పది రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో అల్పపీడనం ముప్పు పొంచిఉందని వాతావరణ శాఖ అలర్ట్‌ జారీ చేసింది. ఈ నెల 6, 7వ‌ తేదీల్లో నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలిపింది.

దీని ప్రభావంతో తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. నవంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించారు. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు.. తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

తాజా అల్పపీడన ప్రభావంతో ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో నవంబర్ లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement