ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే భారీ వర్షాలు కురిసిన విషయం విధితమే.. అయితే మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి వాయుగుండంగా మారిందని తెలిపారు.
అలాగే రాబోయే మూడు రోజుల్లో తమిళనాడులో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈనెల 24 నుంచి దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు చెప్పారు. ఈశాన్య గాలుల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో చలి ప్రభావం పెరుగుతుందని, రాష్ట్రమంతటా దట్టమైన పొగమంచు అలముకుంటుందని వివరించారు.