ప్రభుత్వం వెంటనే వీఓఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. సెర్ప్ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల డిమాండ్స్ ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో VOA లు కూడ కీలక పాత్ర పోషించారు అని, వీవోఏలు గ్రామస్థాయిలో గత 20 ఏళ్లుగా డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్ధికంగా, సామజికంగా ఎదుగడానికి లు పని చేస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో 20 వేల వరకు వీవోఏ ఉద్యోగులు పని చేస్తున్నారు. అందరు మహిళలే, గ్రామ స్థాయిలో పని చేస్తుంటారు. ఐతే వీవోఏలకు ఇప్పటికి కేవలం 3900 రూపాయలు మాత్రమే వేతనం ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీవోఏల డిమాండ్స్ నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఎనిమిది ఏళ్లు అవుతున్నా వీవోఏల సమస్య లు పరిష్కారం కాలేదన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో చాలీచాలని జీతాలతో ఐకేపీ వీవోఏలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే వీవోఏలకు సెర్ప్ నుండి 15 వేల రూపాయల వేతనం చెల్లించాలి. వీఓఏ ఉద్యోగులను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి. 10 లక్షలతో భీమా కల్పించాలి, ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలన్నారు. సెర్ప్ నుండి ఐడీ కార్డు లు ఇవ్వాలి, వీవోఏలు అందరికి ఒకేరకమైన యూనిఫామ్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రస్థావించడం జరిగిందన్నారు. ఇప్పుడు మరొకసారి ప్రభుత్వానికి గుర్తు చేయడానికి సిఎంకి లేఖ రాస్తున్న అని తెలిపారు. ఇటీవలే నా దగ్గరికి వస్తున్న సమస్యలను లేఖ ద్వారా, మీడియా ద్వారా మీ దృష్టికి కి తీసుకొని వస్తున్నా అన్నారు. వెంటనే ప్రభుత్వం వీవోఏల డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతున్న అని లేఖలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement